‘అర‌వింద స‌మేత‌కు’ అభిమానులు భారీ షాక్!

October 11, 2018 at 12:47 pm

హారిక‌-హాసిని క్రియేష‌న్ ప‌తాకంపై త్రివిక్ర‌మ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తొలి సినిమా అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌. ఈ సినిమా ట్రైల‌ర్ సినిమాపై భారీగా అంచ‌నాల‌ను పెంచేసింది. ద‌స‌రా కానుక‌గా ఈ సినిమా అక్టోబ‌ర్ 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే.. అంతకుముందే ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్‌షోలు, ఇక బెనిఫిట్‌షోల‌తో సంద‌డే సంద‌డి. అభిమానుల కోలాహ‌లం ఒక‌వైపు.. పైర‌సీభూతం మ‌రోవైపు. సినిమా విడుద‌ల అయిన‌ తొలిరోజే.. అదీ తొలి ఆటకి ముందే పైరసీ బారినపడింది. అర్థరాత్రి 12.30 నిమిషాల తర్వాత మొట్టమొదటి షో పడుతుండ‌గానే.. దానికి సంబంధించిన అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

68482d44-f5a4-417e-a479-a3f5dcef4584

‘ నేను సినిమా చూస్తున్నా..’ అంటూ కొంద‌రు పేర్లు ప‌డిన‌ప్ప‌టి నుంచి, సినిమాలోని కీల‌క‌సీన్ల‌కు సంబంధించిన‌ ‘స్క్రీన్‌ షాట్స్‌’ సోషల్‌ మీడియాలో పెట్టేస్తూ వచ్చారు. ఇదంతా కూడా అర‌వింద సినిమాకు ఇబ్బందిక‌రంగా మారుతోంది. మ‌రికొంద‌రైతే.. ఏకంగా ప‌లు స‌న్నివేశాల‌ను వీడియోలు తీసి మ‌రీ బ‌య‌ట‌కు వ‌దిలారు. ఎన్టీఆర్ ఎంట్రీ, యాక్ష‌న్ స‌న్నివేశాలు, పాట‌లు, డ్యాన్స్‌.. ఇలా దాదాపుగా క్లిప్పింగ్స్‌వారీగా వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడీ ఈ వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. ఇది ఇప్ప‌టికిప్పుడు అంద‌రికీ సంతోషాన్ని ఇవ్వ‌వ‌చ్చుగానీ.. చివ‌ర‌కు సినిమా రంగానికి పెద్ద న‌ష్టాన్ని క‌లిగిస్తుంద‌ని ప‌లువురు అంటున్నారు.

ఈ ప‌రిణామాలు సినిమాల‌కు పెద్ద శాపంలా మారుతున్నాయి. ఇలా పెద్ద‌హీరోల సినిమాల‌న్నీ పైర‌సీబారిన ప‌డుతున్నాయి. ‘బాహుబలి ది కంక్లూజన్‌’ విషయంలోనూ ఇలాగే జ‌రిగింది.‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను‘ సినిమాలకీ ఈ ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి. ఇలా చేయ‌డం స‌రికాద‌నీ.. సినిమారంగానికి పెద్ద న‌ష్టం చేస్తుంద‌నీ.. ప‌లువురు మొత్తుకుంటున్నా.. లాభం లేకుండా పోయింది. చేతిలో స్మార్ట్‌ఫోన్లు ఉన్నాక‌.. వాటిని ఆప‌డం ఎవ‌రి త‌ర‌మూ కావ‌డం లేదు. ఇది ఎవ‌రికి వారుగా బాధ్య‌త‌గా ఉండాల్సిన విష‌య‌మ‌నీ.. ఇలా చేయ‌డం త‌గ‌దు.. ప్లీజ్ అంటూ ప‌లువురు వేడుకుంటున్నా.. ఫ‌లితం లేకుండా పోతోంది.

చేతిలోకి అత్యాధునిక స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చిన త‌ర్వాత సినిమాలు పైర‌సీ పాల‌వ్వ‌డం ఎక్కువైపోతోంది. ముఖ్యంగా ఓవ‌ర్సీస్‌లో సినిమా ముందే విడుద‌ల కావ‌డం.. అక్క‌డ చూస్తున్న వారు వీడియోలు తీసి త‌మ స్నేహితుల‌కు పోస్ట్ చేయ‌డం.. ఈ మ‌ధ్య ఎక్కువ‌గా జ‌రుగుతోంది. తాము సినిమా చూస్తున్నామంటూ ఫ్రెండ్స్‌కు వీడియో క్లిప్లింగ్స్ పంపించ‌డం సినిమాల‌కు శాపంగా మారింది. ఒక్కోసారి ఇక్క‌డ కూడా ముందే బెనిఫిట్ షోలు వేయ‌డం..చూస్తున్న‌వారు వీడియోలు తీసి పంప‌డం కామ‌నైపోయింది. థియేట‌ర్ల‌లోకి మొబైల్స్‌ను తీసుకెళ్ల‌డాన్నినిషేధిస్తేనే.. సినిమాల‌కు పైర‌సీ బెడ‌ద పోతుంద‌ని ఇండ‌స్ట్రీవ‌ర్గాలు అంటున్నాయి.

‘అర‌వింద స‌మేత‌కు’ అభిమానులు భారీ షాక్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share