కొణిదల ప్రొడక్షన్లో ఎన్టీఆర్

February 18, 2017 at 12:04 pm
NTR

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పోటీ ఎక్కువగా ఉండేది నందమూరి ఫామిలీ, కొణిదల ఫామిలీ సినిమాల మధ్యనే. ఇటు సినిమాలలోనే కాకుండా అటు రాజకీయాలలోనూ ఈ రెండుకుటుంభాల మధ్య పెద్దపోటినే ఉంటుంది. అయితే ఇప్పటి తరంలో ఈ రెండు కుటుంబాల హీరోల మధ్య మంచి స్నేహపూరితమయిన వాతావరణమే ఉంటుంది. ఈ రెండుకుటుంభాల మూడోతరం హీరోలయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ల మధ్య మంచి రిలేషనే వుంది.

అయితే ఈ మధ్యకాలమే కొణిదల ప్రొడక్షన్స్ పేరుతో  సినిమా ప్రోడుక్ష హౌస్ స్టార్ట్ చేసి మెగాస్టార్ హీరోగా ఖైదీ నెం:150 సినిమాతో నిర్మాత గా మారాడు చరణ్. అయితే ఇప్పుడు ఆ ప్రొడక్షన్ హౌస్ లో బయటి హీరోస్ తో కూడా సినిమాలు నిర్మించాలనే ఆలోచనతో వున్నాడట. ఆల్రెడీ 2 , 3 సినిమాలు శర్వానంద్, అఖిల్ తో చేయటానికి నిర్ణయించుకున్నాడట. ఆ తర్వాత 4 వ. సినిమా మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయాలనే ఆలోచనతో వున్నాడట.

ఎన్టీఆర్ తో చేయటానికి మంచి కథాంశం కూడా సిద్ధం చేసుకున్నాడని ఒక్కసారి ఎన్టీఆర్ ని కలిసి మాట్లాడటమే తరువాయి అని ఫిలింనగర్ సమాచారం. చెర్రీతో వున్న స్నేహం కారణంగా ఎన్టీఆర్ కూడా ఒప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇదేగనుక జరిగితే కలక్షన్స్ పరంగా సునామీ సృష్టించటం కాయం.

కొణిదల ప్రొడక్షన్లో ఎన్టీఆర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share