ఎన్టీఆర్ కోసం ప‌వ‌ర్‌స్టార్‌

నాలుగు వ‌రుస హిట్ల‌తో ఉన్న యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమా కోసం యావ‌త్ టాలీవుడ్ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోంది. జై ల‌వ‌కుశ స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు సెట్స్‌మీద‌కు వెళుతుందా ? అని వెయిట్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌తో సినిమా తెర‌కెక్కిస్తోన్న త్రివిక్ర‌మ్ ఈ సినిమా కంప్లీట్ చేసుకున్న వెంట‌నే ఎన్టీఆర్ సినిమాను సెట్స్‌మీద‌కు తీసుకు వెళ్ల‌నున్నాడు.

ఇదిలా ఉంటే మధ్య‌లో గ్యాప్ రావ‌డంతో ఎన్టీఆర్ ఈ టైంలో మ‌రో సినిమాకు క‌మిట్ అవుతాడ‌ని అంద‌రూ అనుకున్నారు. దిల్ రాజు బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేసేందుకు ఎన్టీఆర్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే షాక్ ఏంటంటే లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా సోమ‌వార‌మే లాంచ్ కానుంది.

మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతుండడం విశేషం. జై లవ కుశ మూవీ మంచి హిట్ కొట్టడంతో జోష్ మీదున్నారు ఎన్టీఆర్. త్రివిక్రమ్‌తో ఆయన మొదటి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ కాంబినేషన్‌పై భారీగా అంచనాలున్నాయి.

మ‌రి ఎన్టీఆర్ సినిమా లాంచింగ్‌కు ప‌వ‌ర్‌స్టార్ ముఖ్యఅతిధి అంటే అది టాలీవుడ్‌లో సెన్షేష‌న‌ల్ న్యూస్ అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక 2018 జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.