బాబిని టెన్ష‌న్ పెడుతోన్న ఎన్టీఆర్‌

ఇటీవల టాలీవుడ్‌లో ట్రెండ్ మారుతోంది. స్టార్ హీరోలంద‌రూ బాలీవుడ్‌లో లాగా త‌మ సినిమాల రిలీజ్ డేట్ల‌ను ముందుగానే ప్ర‌క‌టిస్తున్నారు. అనుకున్న టైంకు కాస్త అటూ ఇటూగా సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకేసారి ఎక్కువ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తే భారీ ఓపెనింగ్స్ వ‌చ్చే అడ్వాన్స్ ఉండ‌డంతో సినిమా సినిమాకు మ‌ధ్య ఒక‌టి లేదా రెండు వారాలు గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ క్ర‌మంలోనే యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ సైతం త‌న కొత్త సినిమా జైల‌వ‌కుశ విష‌యంలో అనుకున్న డేట్‌కే రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాడు. ముందుగా అనుకున్న‌ట్టుగా జైల‌వ‌కుశను సెప్టెంబ‌ర్ 1నే రిలీజ్ చేసేలా షూటింగ్ కంప్లీట్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు బాబిపై ఒత్తిడి తెస్తున్నాడ‌ట ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ ఒత్తిడితో బాబి కాస్త టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ చివ‌రి సినిమా జ‌న‌తా గ్యారేజ్ సైతం సెప్టెంబ‌ర్ 1కే రిలీజ్ అయ్యి సూప‌ర్ హిట్ అయ్యింది. సెప్టెంబ‌ర్ త‌ప్పుకుంటే మంచి సీజ‌న్ దొర‌క‌డం క‌ష్ట‌మ‌ని భావించిన ఎన్టీఆర్ అదే డేట్‌కు వ‌చ్చేలా చూడాల‌ని బాబిని ప‌దే ప‌దే చెపుతున్నాడ‌ట‌. ఓవ‌రాల్‌గా త‌న‌కు క‌లిసొచ్చిన సెంటిమెంట్ డేట్ కోసం ఎన్టీఆర్ తెగ తాప‌త్ర‌య‌ప‌డుతున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది.