త్రివిక్ర‌మ్ కోసం ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడంటే…

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ సినిమాతో వ‌ర‌సుగా నాలుగో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో న‌టించే సినిమాకు రెడీ అవుతున్నాడు. కొద్ది రోజుల క్రిత‌మే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభోత్స‌వం కూడా జ‌రుపుకుంది.

ఇక ఈ సినిమాకు జ‌న‌వ‌రి నుంచి సెట్స్‌మీద‌కు వెళ్ల‌నుంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆర్మీలో ప‌నిచేసే యువ‌కుడిగా క‌నిపించ‌నున్నాడ‌ట‌. అయితే సినిమా స్టోరీ త్రివిక్ర‌మ్ మార్క్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాకు సోల్జ‌ర్ అనే టైటిల్ కూడా ప‌రిశీలిస్తున్న‌ట్టు మ‌రో టాక్‌.

ఈ సినిమాలో ఎన్టీఆర్ త‌న కెరీర్‌లోనే ఇప్ప‌టి వ‌ర‌కు కనిపించ‌ని స్టైలీష్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడని తెలుస్తోంది. త్రివిక్ర‌మ్ సూచ‌న‌ల మేర‌కు ఎన్టీఆర్ ఇప్ప‌టికే ఈ కొత్త లుక్‌ను ట్రై చేసేప‌నిలో బిజీగా ఉన్నాడ‌ట‌. ఇన్నాళ్లు గడ్డంతో రఫ్ లుక్ లో కనబడిన ఆయన ఈ సినిమాలో మాత్రం పూర్తిగా షేవ్ చేసి క్లాస్ లుక్ లో కనిపించనున్నారట. ఎన్టీఆర్ ఈ కొత్త లుక్‌లో ఫ్యాన్స్‌ను పిచ్చ‌పిచ్చ‌గా మెప్పించ‌డం ఖాయ‌మ‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.