త‌న రెండో కుమారుడి పేరు రివీల్ చేసిన తార‌క్‌

July 4, 2018 at 12:47 pm
Ntr, son, name, revealed, Bhargav ram

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ – లక్ష్మి ప్రణతి దంపతులకు కొద్ది రోజుల క్రిత‌మే మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ – ల‌క్ష్మి ప్ర‌ణ‌తి దంప‌తుల‌కు తొలికాన్పులోనూ మ‌గ‌బిడ్డే పుట్ట‌గా ఇప్పుడు రెండో కాన్పులోనూ మ‌గ‌బిడ్డే పుట్ట‌డంతో నంద‌మూరి హ‌రికృష్ణ ఫ్యామిలీలో ఆనందానికి అవ‌ధులు లేవు. ఇక ఎన్టీఆర్ రెండో బిడ్డ‌కు ఈ రోజు ఉద‌యం నామ‌క‌ర‌ణం జ‌రిగింది.

ఈ నామ‌క‌ర‌ణ వేడుక ముగియగానే తారక్ ట్విట్టర్ ద్వారా తన కుమారుడి ఫోటోను షేర్ చేస్తూ బాబుకి పెట్టిన పేరును కూడ రివీల్ చేశారు. ఇక ఎన్టీఆర్ రెండో కుమారుడికి పెట్టిన పేరేంటో తెలుసా భార్గ‌వ రామ్‌. ఎన్టీఆర్ మొద‌టి కుమారుడికి కూడా త‌న తాత పేరు క‌లిసేలా అభయ్ రామ్ అనే పేరు పెట్టారు.

ఇక ఇప్పుడు రెండో కుమారుడికి భార్గ‌వ రామ్ అన్న పేరు పెట్టారు. ఎన్టీఆర్ త‌న ఇద్ద‌రు కుమారుల‌కు తన తాత రామారావు పేరు క‌లిసి వ‌చ్చేలా పెట్టుకున్నారు. ఇకపోతే తారక్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.

DhPafC9UcAA-cKX

త‌న రెండో కుమారుడి పేరు రివీల్ చేసిన తార‌క్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share