త్రివిక్ర‌మ్ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్ ఇదే (వీడియో)

February 20, 2018 at 4:07 pm
NTR, trivikram, movie, work outs, jim

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ చివ‌రి సినిమా జ‌న‌తా గ్యారేజ్ వ‌చ్చి ఐదు నెల‌లు అవుతున్నా ఎన్టీఆర్ కొత్త సినిమా ఇంకా సెట్స్‌మీద‌కు వెళ్ల‌లేదు. ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా ప్రారంభోత్స‌వం జ‌రుపుకుని రెండు నెల‌లు దాటుతున్నా ఇంకా సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు. ఓ వైపు త్రివిక్ర‌మ్ ఈ సినిమా కోసం స్క్రిఫ్ట్ వ‌ర్క్‌ను ప‌క్క‌గా రెడీగా చేసే ప‌నిలో ఉన్నార‌ని, ఇక ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ సినిమాలో కావాల్సిన క్లాస్ లుక్ కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

 

త్రివిక్ర‌మ్ స్టైల్లో ప‌క్కా క్లాస్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో న‌టించేందుకు ఎన్టీఆర్ త‌న కెరీర్‌లోనే ఇప్ప‌టి వ‌ర‌కు క‌న‌ప‌డ‌ని లుక్‌లో ద‌ర్శ‌న‌మీయ‌నున్నాడు. ఈ మేకోవర్ కేవలం స్టైల్ పరంగా మాత్రమే కాదు శారీరకంగా కూడా ఉండ‌బోతోంది. త్రివిక్రమ్ రాసిన పాత్రలో ఇప్పుడున్న బరువు కంటే ఇంకొంత తగ్గి స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నాడు.

 

ఈ కొత్త లుక్ కోసం ఎన్టీఆర్ త‌న స్పెష‌ల్ ట్రైన‌ర్‌గా లాయ్డ్ స్టీవెన్స్ ను అపాయింట్ చేసుకుని మరీ కసరత్తులు మొదలుపెట్టారు. తాజాగా ఎన్టీఆర్ పూర్తిగా జిమ్ క‌స‌ర‌త్తుల్లో మునిగిపోయాడు. ఈ క‌స‌ర‌త్తుల‌కు సంబంధించిన‌ స్టీవెన్స్ ఒక వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా పూర్త‌య్యే వ‌ర‌కు ఎన్టీఆర్ కోసం స్టీవెన్స్ రెడీ చేసిన స్పెష‌ల్ డైట్‌నే ఫాలో అవ్వాల్సి ఉంద‌ట‌.

 

ఏదేమైనా త్రివిక్ర‌మ్ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా రూల్స్ ఫాలో అవుతున్నాడు. మ‌రి కొత్త రూల్స్ ఫాలో అయ్యే లుక్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మార్చి 23న మొదలుకానున్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజాహెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది.

 

త్రివిక్ర‌మ్ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్ ఇదే (వీడియో)
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share