‘ఆఫీసర్’ ఫస్ట్ డే కలెక్షన్స్…తీవ్ర లోటులో నాగ్

June 2, 2018 at 4:12 pm
Officer, First Day Collections, Nagarjuna, RGV

నాగార్జున – వ‌ర్మ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఆఫీస‌ర్ సినిమా ప‌ట్టాలెక్కిన‌ప్ప‌టి నుంచే ఎవ్వ‌రికి అంచ‌నాలు లేవు. టీజ‌ర్లు, ట్రైల‌ర్లు తుస్సుమ‌నిపించాయి. ఎట్ట‌కేల‌కు ఒక‌టి రెండుసార్లు వాయిదాలు ప‌డిన ఈ సినిమా శుక్ర‌వారం విశాల్ అభిమ‌న్యుడు, రాజ్‌త‌రుణ్ రాజుగాడు సినిమాల‌కు పోటీగా వ‌చ్చింది. తొలి రోజు పలు థియేటర్లలో కనీసం రెంట్‌ అమౌంట్లు కూడా రాకపోవడంతో బయ్యర్లు ఎదురు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఆఫీస‌ర్‌కు ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్‌వైడ్‌గా కేవ‌లం 57 ల‌క్ష‌ల షేర్ మాత్ర‌మే వ‌చ్చింది. ఏరియాల వారీగా చూస్తే క‌లెక్ష‌న్లు దారుణంగా ఉన్నాయి. నాగ్ కెరీర్‌లోనే ఇది వ‌ర‌స్ట్ రికార్డు. ఏపీ+తెలంగాణ‌లో కేవ‌లం 45 ల‌క్ష‌ల షేర్ రాబ‌ట్టిన ఆఫీస‌ర్‌, మిగిలిన అన్ని ఏరియాలు క‌లుపుకుంటే మ‌రో రూ.12 ల‌క్ష‌లు రాబ‌ట్టింది. ఓవ‌రాల్‌గా ఈ సినిమా కేవ‌లం 57 ల‌క్ష‌ల షేర్ రాబ‌ట్టింది.

వ‌ర్మ మ‌రీ నాసిర‌క‌మైన క‌థ‌తో ఈ సినిమా తీయ‌డం వ‌ల్లే ఇంత దారుణ‌మైన వ‌సూళ్లు వ‌చ్చాయి. వ‌ర్మ మీద న‌మ్మ‌కంతో నాగ్ ఎంత దారుణంగా మోస‌పోయాడో ఆఫీస‌ర్ వ‌సూళ్లే చెపుతున్నాయి.

‘ఆఫీసర్’ ఫస్ట్ డే కలెక్షన్స్…తీవ్ర లోటులో నాగ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share