‘ ఆఫీస‌ర్ ‘ క‌లెక్షన్లు…. ఎంత దారుణం అంటే

June 6, 2018 at 9:52 am
టాలీవుడ్ కింగ్ నాగార్జున – సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన ఆఫీస‌ర్ సినిమా ప‌రిస్థితి బాక్సాఫీస్ వ‌ద్ద చాలా దారుణంగా  ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల‌కే చాప చుట్టేసింది. చాలా థియేట‌ర్ల‌లో ఆఫీస‌ర్ సినిమాను తీసేసి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విశాల్ – స‌మంత అభిమ‌న్యుడు సినిమాను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. 
 
ఈ సినిమా విడుదలైన మొదటిరోజు నుండి విపరీతమైన నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఫస్ట్ రోజు రూ.50 ల‌క్ష‌లు  కూడా కల్లెక్ట్ చేయలేదు. తొలి రోజు ఎంత చిన్న హీరో సినియా అయినా నెగిటివ్ టాక్ వ‌స్తే ఎంత చీఫ్‌గా అయిన రూ.3-5 కోట్లు వ‌ర‌కు కలెక్ట్ చేస్తోంది. అంతెందుకు గ‌త‌వారం రిలీజ్ అయిన ర‌వితేజ నేలటిక్కెట్ సినిమా కూడా డిజాస్ట‌రే.
 
నేల‌టిక్కెట్ కూడా రూ.10 కోట్ల వ‌ర‌కు తొలివారంలో క‌లెక్ట్ చేసింది. ఆఫీస‌ర్ మాత్రం చాలా దారుణ‌మైన వ‌సూళ్లు రాబ‌డుతోంది. చివ‌ర‌కు థియేట‌ర్ల రెంట్లు కూడా రాక‌పోవ‌డంతో సినిమాను తీసేస్తున్నారు. తొలి రోజు రూ.45 ల‌క్ష‌లు రాబ‌ట్టిన ఈ సినిమా రెండో రోజు కేవలం 11లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందో..!
 
వ‌ర్మ‌కు ఇలాంటి సినిమాలు కామ‌నే అయినా…. నాగార్జున‌కు మాత్రం త‌న కెరీర్‌లో ఓ చేదు జ్ఞాప‌కంగా ఈ సినిమా మిగిలిపోయింది. వ‌ర్మను ఇక‌పై పెద్ద హీరోలు ఎవ్వ‌రూ న‌మ్మే రిస్క్ అయితే చేయ‌ర‌ని ఆఫీస‌ర్ రిజ‌ల్ట్ చెప్పేసింది.
‘ ఆఫీస‌ర్ ‘ క‌లెక్షన్లు…. ఎంత దారుణం అంటే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share