రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన ‘ ఆఫీస‌ర్‌ ‘

June 5, 2018 at 8:50 am
Officer, Nagarjuna, RGV, collections
ఇండ‌స్ట్రీలో హిట్టు, ప్లాపు అనేది కామ‌న్‌. ఎప్పుడైనా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, హీరోలు క‌థ‌ప‌రంగా విన్న‌ప్పుడు మంచిగా ఉన్న సినిమాలు తెర‌మీద‌కు స‌రిగా ప్ర‌జెంట్ చేయ‌లేన‌ప్పుడు ప్లాప్ అవ్వ‌డం కామ‌న్‌. అయితే నాగార్జున కెరీర్‌లోనే అత్యంత దారుణ‌మైన సినిమాగా రికార్డుల‌కు ఎక్కేసింది ఆయ‌న తాజా సినిమా ఆఫీస‌ర్‌. ఇది నాగ్ కెరీర్‌లో ఓ మాయ‌ని మచ్చ‌గా మిగిలిపోయింది. 
 
నాగ్ కెరీర్‌లో అత్యంత దారుణ‌మైన డిజాస్ట‌ర్ల జాబితాలో నిలిచే ఆకాశ‌వీథిలో సినిమా సైతం ఈ సినిమా ముందు చాలా చాలా బెట‌ర్‌. నాగ్ కెరీర్‌లో ఎన్నో డిజాస్ట‌ర్లు ఉన్నా ఆఫీస‌ర్‌ను మించిన డిజాస్ట‌ర్ ఎప్పుడూ రాలేద‌నే చెప్పాలి. అస‌లు తెలుగులో ఏ పెద్ద హీరో సినిమా ప్లాప్ అయినా ఇంత చ‌ర్చ న‌డిచేదేమి కాదేమో..!
 
పెద్ద హీరోల సినిమాల విష‌యంలో ఆఫీస‌ర్‌ను బీట్ చేసి మ‌రీ డిజాస్ట‌ర్ అయ్యే సినిమా మ‌రొక‌టి వ‌స్తుందా ? అంటే రాద‌నే అన్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. ఎందుకంటే రెండో రోజుకే థియేటర్లన్నీ ఖాళీ అయిపోయి.. మెజారిటీ ఏరియాల్లో మెయింటైనెన్స్ ఖర్చులు కూడా రానంత దుస్థితి. 
 
కొన్ని మ‌ల్టీఫ్లెక్స్‌ల‌లో సాయంత్రానికే షోలు క‌ట్ చేస్తే…. సింగిల్ స్క్రీన్ల‌లో రెండో రోజుకే సినిమా లేపేశారు. అస‌లు కొంద‌రు ఈ సినిమాకు థియేట‌ర్లు ఇచ్చేందుకే ఇష్ట‌ప‌డ‌లేదు. ఎందుకంటే సినిమా రిజ‌ల్ట్ ముందే ఊహించి రెండో రోజుకే తాము కొత్త సినిమా ఎక్క‌డ వెతుక్కోవాల్రా బాబూ అని వాళ్ల‌కు ప‌రిస్థితి అర్థ‌మైపోయింది. సినిమా ప్లాప్ అని తేలడంతో వ‌ర్మ టీం ఎంచ‌క్కా ముంబై చెక్కేస్తే, నాగ్ సైలెంట్ అయిపోయాడు.
రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన ‘ ఆఫీస‌ర్‌ ‘
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share