” ఓం న‌మో వేంక‌టేశాయ ” బ‌య్య‌ర్ల‌కు టెన్ష‌న్‌..టెన్ష‌న్‌

February 13, 2017 at 11:03 am
ONV

టాలీవుడ్ కింగ్ నాగార్జున – ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్ర రావుల కలయికలో ప్రేక్షకుల ముందుకొచ్చిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంపై ముందునుంచి ఉన్న అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాకు హిట్ టాక్ వ‌చ్చినా బయ్య‌ర్లు మాత్రం టెన్ష‌న్‌తో ఉన్నార‌ట‌.

అదేంటి సినిమాకు అంత‌టా హిట్ టాక్ వ‌స్తే బ‌య్య‌ర్లు ఆందోళ‌న‌తో ఉండ‌డానికి రీజ‌న్ ఏంట‌నుకుంటున్నారా ఈ చిత్రం ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్లు చాలా వీక్‌గా ఉన్నాయి. ఈ సినిమా ఫ‌స్ట్ వీకెండ్ మూడు రోజులు క‌లిపి ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.7 కోట్లు కూడా రాబ‌ట్ట‌లేద‌ట‌. సాధార‌ణంగా భ‌క్తిర‌స చిత్రాల క‌లెక్ష‌న్లు స్టార్టింగ్‌లో చాలా డ‌ల్‌గా ఉంటాయి. త‌ర్వాత బాగా పిక‌ప్ అవుతాయి. ఓం నమో వెంకటేశాయకు లాంగ్ ర‌న్ ఉండేందుకు పెద్ద టైం కూడా లేదు.

త‌ర్వాత వీక్‌లో రానా ఘాజీ ఉంది. త‌ర్వాత విన్న‌ర్‌, గుంటూరోడు, కేశ‌వ‌, కిట్టుగాడు లాంటి చాలా సినిమాలు ఉన్నాయి. చాలా థియేట‌ర్లు ఖాళీ కానున్నాయి. ఫ‌స్ట్ వీకెండ్‌లో ప్ర‌భావం చూప‌క‌పోవ‌డంతో ఈ సినిమా బ‌య్య‌ర్లు చాలా టెన్ష‌న్‌లో ఉన్నార‌ని ట్రేడ్ టాక్‌. ఈ సినిమాతో పాటు వ‌చ్చిన సింగం-3 బీ, సీ సెంట‌ర్ల‌లో దుమ్ము రేప‌డం కూడా ఓం న‌మో వేంక‌టేశాయపై ఆ ప్ర‌భావం చూపించింది.

ఓం న‌మో వేంక‌టేశాయ‌ బయ్యర్లు సేఫ్ గా బయటపడాలంటే దాదాపు రూ. 35 కోట్లకి పైగా రిటర్న్ రావాలి. మరీ. శ్రీనివాసుడు బయ్యర్లని సేఫ్ గా బయటపడేస్తాడో లేదో చూడాలి.

 

” ఓం న‌మో వేంక‌టేశాయ ” బ‌య్య‌ర్ల‌కు టెన్ష‌న్‌..టెన్ష‌న్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share