‘పందెం కోడి-2’ మూవీ రివ్యూ

October 19, 2018 at 10:20 am

నటులు : విశాల్‌, కీర్తి సురేష్‌, రాజ్‌ కిరణ్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌
దర్శకత్వం : లింగుసామి
నిర్మాత : విశాల్‌
కెమెరా : కె.ఎ.శ‌క్తివేల్‌
సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా

ప్రేమ చద‌రంగం`తో కెరీర్‌ను స్టార్ చేసిన విశాల్‌కు రెండో సినిమా `సండైకోళి`. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం విశాల్‌కు యాక్ష‌న్ హీరో ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. అంతే కాకుండా తెలుగులో `పందెంకోడి` అనే పేరుతో విడుద‌లై పెద్ద విజ‌యాన్ని సాధించి.. విశాల్‌కు తెలుగులో మంచి పేరు తెచ్చింది. వాస్తవానికి విశాల్ తెలుగు వాడే అయినా..తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఇలా తెలుగు, తమిళంలో ఆద‌ర‌ణ ఉన్న అతి త‌క్కువ మంది హీరోల్లో విశాల్ ఒక‌రయ్యారు. అలాంటి హీరో విశాల్ త‌న 25వ సినిమాగా త‌న‌కు బ్రేక్ ఇచ్చిన పందెంకోడి సీక్వెల్‌గా `పందెంకోడి 2`ని న‌టిస్తూ నిర్మించ‌డం విశేషం. 13 ఏళ్ల తరువాత తెరకెక్కిన ఈ మాస్‌ యాక్షన్‌ సీక్వెల్‌ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? విశాల్‌ నటిస్తూ నిర్మించిన పందెంకోడి 2తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా..?

కథ :
రాజా రెడ్డి (రాజ్‌ కిరణ్‌) కడప జిల్లాలోని ఎన్నో గ్రామాలను తన కంటి చూపుతో శాసించే పెద్ద మనిషి. ఏడేళ్ల క్రితం వీరభద్ర స్వామి జాతరలో జరిగిన గొడవలో భవానీ(వరలక్ష్మీ శరత్‌ కుమార్‌) భర్త హత్యకు గురవుతాడు. త‌న భర్త‌ను చంపిన వ్య‌క్తి కుటుంబంపై క‌క్ష పెంచుకుంటుంది. వారి కుంటుంలో అంద‌రిన చంపేస్తుంది. ఓ కుర్రాడిని మాత్రం చంప‌కుండా వ‌దిలేస్తారు. ఈ గొడ‌వ‌ల కార‌ణంగా ఏడు గ్రామాల జాత‌ర ఏడేళ్లు ఆగిపోతుంది. చివ‌ర‌కు రాజా రెడ్డి ఏడు గ్రామాల పెద్ద‌ల‌తో క‌లిసి మ‌ళ్లీ జాత‌ర‌ను ఘ‌నంగా చేయాల‌నుకుంటారు. ఏడేళ్లుగా ఈ గొడవలకు దూరంగా ఉన్న రాజా రెడ్డి కొడుకు.. బాలు(విశాల్) కూడా జాతర కోసం ఊరికి వస్తాడు. జాతర మొదలైన నాలుగో రోజు గోపిని కాపాడే ప్రయత్నాల్లో రాజారెడ్డి గాయపడతాడు. ఈ విషయం ఊరి ప్రజలకు తెలిస్తే ఒక్కరిని కూడా బతకనివ్వరని భయంతో ఊళ్లో జనాలకు రాజా రెడ్డి మీద దాడి జరిగిన విషయాన్ని చెప్పుకుండా దాచిపెట్టి జాతర ఆగకుండా జాగ్రత్త పడతాడు బాలు. ఏడేళ్లుగా విదేశాల్లో ఉంటున్న బాలు(విశాల్) జాత‌ర‌ను చూడ‌టానికి ఊరొస్తాడు. ఊర్లోనే చారుల‌త‌(కీర్తిసురేశ్‌) ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఇద్ద‌రూ ప్రేమించుకుంటారు. అదే స‌మ‌యంలో ఏడేళ్లుగా విదేశాల్లో ఉంటున్న బాలు(విశాల్) జాత‌ర‌ను చూడ‌టానికి ఊరొస్తాడు. ఊర్లోనే చారుల‌త‌(కీర్తిసురేశ్‌) ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఇద్ద‌రూ ప్రేమించుకుంటారు. ఏడు రోజుల పాటు జ‌రిగే జాత‌ర‌లో భ‌వాని, ఆమె మ‌నుషులు ఆ కుర్రాడిని చంపాల‌నుకుంటారు. కానీ రాజారెడ్డి, బాలు ఆ కుర్రాడిని వివిధ సంద‌ర్భాల్లో కాపాడుకుంటూ ఉంటారు. చివ‌ర‌కు ఓ గొడ‌వ‌లో రాజారెడ్డికి అనుకోని ప్ర‌మాదం జ‌రుగుతుంది. బాలు, గోపి ప్రాణాన్ని కాపాడాడా..? అనుకున్నట్టుగా జాతర సజావుగా జరిగిందా..? చివరకు భవానీ కథ ఎలా ముగిసింది..? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ :
2005లో పందెం కోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న లింగుస్వామి సీక్వెల్‌ లో మరోసారి తానేంటో నిరూపించాడు. విశాల్‌కు యాక్ష‌న్ హీరో ఇమేజ్ ద‌క్కింది. ఇప్పుడు సీక్వెల్ పార్ట్ వ‌న్‌కు కంటిన్యూగా ఉంటుంది. అయితే దీనిలో ఏడు రోజుల పాటు జాత‌ర జ‌రుపుకోవ‌డం అనే కాన్సెప్ట్‌ను లింగుస్వామి తెర‌కెక్కించిన తీరు బావుంది. ఇక విశాల్ మాస్ హీరోగా అల‌రించాడు. త‌న‌దైన యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌తో మెప్పించాడు. తెలుగులో ఈ తరహా ఫ్యాక్షన్‌ కథలు గతంలో చాలానే వచ్చాయి. అయితే విశాల్‌ ఇమేజ్‌, బాడీ లాంగ్వేజ్‌ సినిమాకు ప్లస్‌ అయ్యాయి. సినిమా అంతా కేవలం వారం రోజులు పాటు జరిగే ఓ జాతరకు సంబంధించిన కథ కావటంతో చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగిన ఫీలింగ్‌ కలుగుతుంది. సెకండాఫ్‌లో సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఆక‌ట్టుకుంటుంది. ఇక సినిమాలో మెయిన్ పాత్ర కీర్తిసురేశ్.. ఈ సినిమాలో కామెడీ పార్ట్ అనేదేదైనా ఉందంటే అది కీర్తిసురేశ్ వ‌ల్ల‌నే క్రియేట్ అయ్యింది. విశాల్‌, కీర్తి సురేష్ మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్స్‌ అలరిస్తాయి. జాతర వాతావరణాన్ని, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను అద్భుతంగా తెరమీద చూపించారు. ఎడిటింగ్‌, ఆర్ట్‌ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో.. రాజారెడ్డి పాత్ర‌లో రాజ్‌కిర‌ణ్ మ‌రోసారి త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించారు. ఇక గంజా క‌రుప్పు, రాందాస్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల మేర న‌ట‌న‌తో ఆకట్టుకున్నారు. ఇక రాందాస్ న‌ట‌న సినిమాకు ప్ర‌ధానంగా మారింది. సినిమాలో మీరా జాస్మిన్ పాత్ర ఏమైంద‌నే విష‌యాన్ని క్లారిటీతో చూపించ‌లేక‌పోయారు. ఇక క్లైమాక్స్ ఏంట‌నేది పూర్తిగా తెలిసిపోయినా… ద‌ర్శ‌కుడు లింగుస్వామి ఆ పాయింట్‌ను డీల్ చేసిన తీరు బావుంది. అయితే కొన్ని స‌న్నివేశాల్లో లాజిక్స్ మిస్ అయ్యాయి. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. విశాల్‌ ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందించాడు.

నటీనటులు :
విశాల్ అంటేనే మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. ఈ మధ్య కాలంలో డిటెక్టివ్, అభిమన్యుడు లాంటి సినిమాలతో బాగా ఆకట్టుకున్నాడు. 13 ఏళ్ల క్రితం వచ్చిన పందెంకోడి సినిమా సీక్వెల్ పందెంకోడి 2 తో మాస్ ప్రేక్షకుల మనసు దోచాడు. ‘పందెం కోడి 2’ తెలుగు నేటివిటీకి పూర్తిగా దూరమైంది. ఎంచుకున్న థీమ్‌కు సరైన స్క్రిప్ట్ ట్రీట్‌మెంట్ లేకపోవడం ఈ సినిమాకు మైనస్. రాయలసీమకు చెందిన యువకుడి పాత్రలో విశాల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. యాక్షన్, లవ్, ఎమోషన్స్ సీన్స్‌లో తన సహజశైలి నటనతో ఆకట్టుకున్నాడు.ఇక పల్లెటూరి గడుసరి పిల్లగా చారుమతి పాత్రలో కీర్తి సురేష్ అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. భవాని పాత్రలో నటించిన వరలక్ష్మి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తొలి నుండి సీరియస్ లుక్‌లో ఒకే ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో నడిపించేసింది. క్లైమాక్స్ సీన్‌లో పర్వాలేదనిపించినా ప్రతినాయికగా పూర్తి న్యాయం చేయలేకపోయింది. విశాల్‌కి తండ్రి పాత్రలో నటించిన రాజారెడ్డి గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు. సినిమాలో హీరోతో సమానంగా ఆయన క్యారెక్టరైజేషన్ ఉంది.

సాంకేతికవర్గం :
జాతర.. అవును విశాల్ ‘పందెంకోడి 2’ ఓ పే..ద్ద జాతర. పగలు ప్రతీకారాలతో ఏడేళ్ల క్రితం ఆగిపోయిన జాతరను తిరిగి జరిపించాలని దీక్ష పూనిన ఓ ఊరిపెద్ద.. అతడికి అండగా నిలిచిన కొడుకు.. జాతరను ఎలాగైనా ఆపాలని ప్రతీకారంతో రగిలిపోయే లేడీ విలన్. ఇదీ స్థూలంగా ‘పందెంకోడి 2’ కథ. దర్శకుడు లింగుసామి ఎప్పుడో పదమూడేళ్ల క్రితం వచ్చిన ‘పందెం కోడి’ దగ్గరే ఆగిపోయారు. అందుకే ‘పందెం కోడి 2’ జాతర కథ మిస్ ఫైర్ అయ్యింది. టెక్నికల్ పరంగా యువన్ శంకర్ రాజా సంగీతం పెద్దగా వర్కౌట్ కాలేదు. నేపథ్య సంగీతం పర్వాలేదనిపించింది. శక్తివేల్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ కె. ఎల్ ప్రవీణ్ అక్కర్లేని సీన్లను ట్రిమ్ చేసి ఉంటే బావుండేది. ఈ సినిమాలో చాలా సీన్లు సాగదీసినట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ : విశాల్ నటన, యాక్షన్‌ ఎపిసోడ్స్‌, కీర్తిసురేష్

మైనస్‌ పాయింట్స్‌ : రోటీన్ కథ, సెకండ్‌ హాఫ్‌లో కొన్ని సీన్స్‌, మ్యూజిక్

బోట‌మ్ లైన్‌: సీమ పౌరుషం చూపిన..‘పందెంకోడి 2’
రేటింగ్‌: 2.5/5

‘పందెం కోడి-2’ మూవీ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share