‘పంతం’ ఫస్ట్ డే కలెక్షన్స్..గోపి పంతం నెగ్గిందా

July 6, 2018 at 12:36 pm

గోపిచంద్‌ చాలాకాలం నుంచి హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. లౌక్యం సినిమాతో చివరగా విజయాన్ని అందుకున్న గోపిచంద్‌ పంతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్‌ అండ్‌ మెసెజ్‌ ఓరియెంటెడ్‌గా తెరకెక్కిన ఈ మూవీకి మొదటి రోజు కలెక్షన్లు బాగానే వచ్చాయని తెలుస్తోంది. అయితే గత వారం సరైన సినిమాలేవీ థియేటర్స్ లో లేకపోవడంతో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. టాక్ తో సంబంధం లేకుండా గోపీచంద్ పంతం సినిమా కలెక్షన్స్ రాబట్టింది.

కానీ పంతం కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. ట్రైలర్‌తో అంచనాలు పెంచిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను తెచ్చుకుంది. మొదటి రోజే దాదాపు 5కోట్ల షేర్‌ను, 3 కోట్ల గ్రాస్‌ను రాబట్టిందని సమాచారం. ఇక వీకెండ్‌ పూర్తయ్యే సరికి ఈ సినిమా పూర్తి రిపోర్ట్‌ వస్తుంది. ఈ సినిమాలో గోపిచంద్‌ సరసన మెహ్రీన్‌ జోడిగా నటించారు. ఈ సినిమాకు గోపిసుందర్‌ సంగీతమందిచగా, కేకే రాధామోహన్‌ నిర్మించగా, కె చక్రవర్తి దర్శకత్వం వహించారు.

ఏరియా: ఫస్ట్ డే షేర్

నైజాం – 1,12,00,000
సీడెడ్ – 47,00,000
నెల్లూరు – 12,00,000
గుంటూరు – 33,00,000
కృష్ణ – 15,77,125
వెస్ట్ గోదావరి – 16,35,976
ఈస్ట్ గోదావరి – 20,92,000
ఉత్తరాంధ్ర – 34,79,085

ఏపీ, టీస్ షేర్ – 2.92 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా – 20,00,000
ఓవర్సీస్ – 10,00,000

వరల్డ్ వైడ్ షేర్ 3.22 కోట్లు,

గ్రాస్ 5.2 కోట్లు

‘పంతం’ ఫస్ట్ డే కలెక్షన్స్..గోపి పంతం నెగ్గిందా
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share