‘పంతం’ టీజ‌ర్ రివ్యూ…. పొలిటిక‌ల్ పంచ్‌లే (వీడియో)

June 5, 2018 at 1:37 pm
Pantham, Teaser,  Gopichand, Mehreen

గ‌త కొంత‌కాలంగా స‌రైన హిట్ లేక త‌న రేంజ్‌కు త‌గిన హిట్ కోసం వెయిట్ చేస్తోన్న గోపీచంద్ తాజా సినిమా పంతం. గోపీచంద్ కెరీర్‌లో 25వ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టీజ‌ర్ మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు. ‘బలుపు’, ‘పవర్’, ‘జై లవ కుశ’ వంటి హిట్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి (చక్రి) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.

గోపీచంద్‌కు మాస్‌లో ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పంతం సినిమాను తెర‌కెక్కించిన‌ట్టు ట్రైల‌ర్‌లో స్ప‌ష్ట‌మైంది. పంతం టీజర్‌ లంచగొండి నాయకులకు ఓటేసి గెలిపించిన ప్రజలకు స్ట్రాంగ్‌గానే క్లాస్ పీకారు. ‘ఫ్రీగా ఇళ్లు ఇస్తాం.. కరెంటు ఇస్తాం.. రుణాలు మాఫీ చేస్తాం.. ఓటుకి ఐదువేలు ఇస్తాం అనగానే ముందు వెనుక, మంచి చెడు ఆలోచించకుండా ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి.. కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడ నుండి వస్తాయ్’ అంటూ గోపీచంద్ చెప్తున్న డైలాగ్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది.

ఓవ‌రాల్‌గా పంతం టీజ‌ర్ చూస్తుంటే రాజకీయ నాయకుల ఇళ్లల్లో ఉన్న అవినీతి సొమ్మును బయటకు తీసి.. ప్రజలకు అందించించడమే గోపీచంద్ ‘పంతం’ అని టీజర్‌ బట్టి అర్ధమౌతోంది. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్, కామెడీ, రొమాన్స్, పొలిటికల్ పంచ్‌లు ఇలా అన్ని ఎలిమెంట్స్ పంతం టీజ‌ర్‌లో ట‌చ్ చేశారు. మ‌రి ఈ సినిమాతో అయినా గోపీ హిట్ కొడ‌తాడేమో ? చూడాలి. ఓవ‌రాల్‌గా మాస్ ప్రేక్ష‌కుల‌ను పంతం టార్గెట్ చేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది.

‘పంతం’ టీజ‌ర్ రివ్యూ…. పొలిటిక‌ల్ పంచ్‌లే (వీడియో)
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share