బీటెక్ బాయ్ ‘పేపర్ బాయ్’గా టీజర్!

July 21, 2018 at 12:40 pm
Paper Boy Official Teaser, Santosh Shoban, Riya Suman,Tanya Hope

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం పేపర్ బాయ్. యువ హీరో సంతోష్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. రియా సుమన్, తాన్యా హోప్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. జయశంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. తాజగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు.

టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌లో రెండో ప్రయత్నంగా తెరకెక్కిన పేపర్ బాయ్ సినిమా టీజర్‌ విడుదలైంది. రామ్‌చరణ్‌, రవితేజ, గోపిచంద్ లాంటి హీరోలతో మాస్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్లను తెరకెక్కించిన సంపత్‌ తన స్వీయ నిర్మాణంలో సినిమాలు రూపొందిస్తున్నారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు ఈ చిత్రాన్ని రొమాంటిక్ ప్రేమకథగా ప్రతి ప్రేముని అందంగా మలచినట్లు టీజర్ ద్వారా స్పష్టం అవుతోంది.

సంతోష్ శోభన్ న్యూస్ పేపర్లు వేసే పేపర్ బాయ్ గా నటిస్తున్నాడు. తాను పేపర్ వేసే ఓ ఇంట్లో అమ్మాయిని చూసి ప్రేమించే కథగా ఈ చిత్రం రానుంది. రియా సుమన్ టీజర్ లో చాలా అందంగా కనిపిస్తోంది. బిటెక్ చదివి పేపర్స్ వేస్తున్నావా.. అది బ్రతకడానికి, ఇది భవిష్యత్తు కోసం అంటూ హీరో హీరోయిన్ మధ్య సాంగ్ సంభాషణ బావుంది. మొత్తంగా పేపర్ బాయ్ టీజర్ చిత్రంపై అంచనాలు పెంచే విధంగా ఉందని చెప్పొచ్చు.

బీటెక్ బాయ్ ‘పేపర్ బాయ్’గా టీజర్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share