ప‌వ‌న్ సినిమాకు హీరో క‌రువు

March 17, 2018 at 10:53 am
pawan kalayn, santhosh srinivas, Movie, Hero, Raviteja, Story

కందిరీగ‌త సినిమాతో ఎక్క‌డికో వెళ్లిన సంతోష్ శ్రీనివాస్ ర‌భ‌స‌తో పాతాళానికి ప‌డిపోయాడు. ర‌భ‌స సినిమా త‌ర్వాత సంతోష్ శ్రీనివాస్‌కు ద‌గ్గ‌ర‌కు రానిచ్చేందుకు మీడియం రేంజ్ హీరోలు కూడా సాహ‌సం చేయ‌లేదు. ఆ త‌ర్వాత ఎట్ట‌కేల‌కు కందిరీగ న‌మ్మ‌కంతో రామ్ మ‌రోసారి హైప‌ర్ సినిమాతో ఛాన్స్ ఇచ్చాడు. హైప‌ర్ స‌బ్జెక్ట్ ప‌రంగా బాగుంద‌న్న టాక్ వ‌చ్చినా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం స‌క్సెస్ కాలేదు.

 

హైప‌ర్ త‌ర్వాత సంతోష్ శ్రీనివాస్‌కు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌నే డైరెక్ట్ చేసే ఛాన్స్ వ‌చ్చింది. మైత్రీ మూవీస్ వాళ్లు ప‌వ‌న్‌కు భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేయ‌డంతో ప‌వ‌న్ కూడా ఈ సినిమా చేయాల‌ని టెంప్ట్ అయ్యాడు. సంతోష్ కూడా ప‌వ‌న్‌ను డైరెక్ట్ చేస్తున్నాన‌ని ఉత్సాహంతో ఉన్నాడు. స్క్రిప్ట్ అంతా చెక్కి, రెడీ చేసేసరికి ఆ ఛాన్స్ కాస్తా చేజారిపోయింది.

 

ఇప్పుడు ప‌వ‌న్ పొలిటిక‌ల్‌గా బిజీ అవ్వ‌డంతో సంతోష్ శ్రీనివాస్‌తో ఈ సినిమాను వేరే వాళ్ల‌తో చేసుకోమ‌ని చెప్పాడ‌ట‌. అయితే ఇప్పుడు సంతోష్‌కు స్క్రిఫ్ట్‌, నిర్మాత‌లు రెడీగా ఉన్నా హీరోలు లేరు. ఈ స్క్రిఫ్ట్‌కు ప‌వ‌న్ లేదా ర‌వితేజ మాత్ర‌మే సూట్ అవుతార‌ట‌. అయితే ఇక్క‌డే చిక్కు ముడి ప‌డింది. అదే మైత్రీ మూవీస్ ప్ర‌స్తుతం ర‌వితేజ‌తో మ‌రో సినిమా స్టార్ట్ చేసింది.

 

పోనీ సినిమా త‌ర్వాత సినిమా ర‌వితేజ అదే బ్యాన‌ర్‌లో చేయాల‌నుకున్నా క‌నీసం ఆరేడు నెల‌లు ఆగాలి. దీంతో సంతోష్ శ్రీనివాస్‌కు ఇప్పుడు వేరే ఆప్ష‌న్ లేదు. అయితే మైత్రీ వాళ్లు మాత్రం అదే క‌థ‌తో ర‌వితేజ‌తో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నార‌ట‌. మ‌రి ర‌వితేజ ఒప్పుకుంటేనే సంతోష్ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కుతుంది. మ‌రి మ‌నోడు డెసిష‌న్ ఏంటో ?  చూడాలి.

 

ప‌వ‌న్ సినిమాకు హీరో క‌రువు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share