ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ టైటిల్‌పై కొత్త ట్విస్ట్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అంటే ప్రేక్ష‌కుల్లో ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాలు రెండూ సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే ప‌వ‌న్ కెరీర్‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన అత్తారింటికి దారేదికి త్రివిక్ర‌మే డైరెక్ట‌ర్‌. ఆ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ చేసిన గోపాలా…గోపాలా – స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ – కాట‌మ‌రాయుడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. గోపాల మాత్ర‌మే యావ‌రేజ్ అయినా అది ప‌వ‌న్ – వెంకీ మూవీ.

ఇక ఇప్పుడు ప‌వ‌న్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తుండ‌డంతో ఓ సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా కోసం ప‌వ‌న్ ఫ్యాన్స్ ప‌రిత‌పించిపోతున్నారు. త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో ప‌వ‌న్ న‌టిస్తోన్న సినిమాపై వారు కోటి ఆశ‌ల‌తో ఉన్నారు. ఈ సినిమాకు జ‌రుగుతోన్న ప్రి రిలీజ్ బిజినెస్సే ఈ సినిమా రేంజ్ ఎలా ఉందో చెపుతోంది. ఈ సినిమా టైటిల్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎనౌన్స్ చేయ‌కుండా త్రివిక్ర‌మ్ స‌స్పెన్స్ మెయింటైన్ చేస్తూ వ‌స్తున్నాడు.

ముందుగా ఇంజ‌నీరింగ్ అబ్బాయి అన్న పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్పుడు అజ్ఞాత‌వాసి ఫైన‌ల్ అయ్యిందంటున్నారు. గాసిప్పులు, ఊహాగానాలే త‌ప్ప అస‌లు టైటిల్ మాత్రం అధికారికంగా ఎనౌన్స్ అవ్వ‌లేదు. ఇక టైటిల్‌పై బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా న‌వంబ‌ర్ 7న సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేస్తున్నార‌ట‌. దీంతో ఆ రోజు ఈ సినిమా టైటిల్ స‌స్పెన్స్‌కు తెర‌ప‌డ‌నుంది.