అన్నయ్యతో సినిమా పై బాంబ్ పేల్చిన పవన్

February 14, 2017 at 5:23 am
chiru nd pawan

మెగా ఫ్యాన్స్‌కు ఓ స్వీట్ న్యూస్ అందిన‌ట్టే అంది వారి పాలిట అది చేదు వార్త‌గా మార‌నుందా ? అంటే అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది. కొద్ది రోజుల క్రితం చిరంజీవి – ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ వ‌స్తుంద‌న్న వార్త రాగానే మెగా ఫ్యాన్స్ సంబ‌రాల‌కు అంతే లేదు. రాజ్య‌స‌భ స‌భ్యుడు, ప్ర‌ముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి ఈ విష‌యాన్ని ఎనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

తాను నిర్మాత‌గా, వైజ‌యంతీ మూవీస్ అధినేత చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ స‌హ‌నిర్మాత‌గా చిరు-ప‌వ‌న్ కాంబోలో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో ఈ సినిమా ఉంటుంద‌ని సుబ్బారామిరెడ్డి ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమా గురించి వ‌స్తోన్న వార్త‌ల‌తో మెగా ఫ్యాన్స్ సంబ‌రాల‌కు అంతేలేదు.

మెగా అభిమానుల‌తో పాటు ప‌వ‌న్ అభిమానులు, టాలీవుడ్ సినీజ‌నాలు కూడా ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందని బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఈ ప్రాజెక్టు ఉండ‌ద‌న్న సంకేతాలు ప‌వ‌న్ నుంచి వ‌చ్చాయి.

యూఎస్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్‌ను విలేక‌రులు మీరు మీ అన్నయ్యతో కలిసి సినిమా చేస్తున్నారా అనే ప్రశ్న రాగానే నవ్వుతూనే అలాంటి ప్రస్తావనేదీ నా దగ్గరకు రాలేదు అని సమాధానమిచ్చి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.దీంతో ఈ ప్రాజెక్టు కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కే మాత్ర‌మే ప‌రిమిత‌మైంద‌న్న టాక్ వ‌చ్చేసింది.

 

అన్నయ్యతో సినిమా పై బాంబ్ పేల్చిన పవన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share