ప‌వ‌న్ అస‌లును వ‌దిలేసి కొస‌రుతో వేలాడుతున్నావేంటి…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన మెర్స‌ల్ ( తెలుగులో అదిరింది ) గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. మెర్స‌ల్‌లో జీఎస్టీ, డిజిట‌ల్ ఇండియా గురించి విజ‌య్ పేల్చిన డైలాగులు నేరుగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని, మోడీ గ‌వ‌ర్న‌మెంట్‌ను టార్గెట్ చేసేలా ఉండ‌డంతో వీటిపై పెద్ద ఎత్తున రాజ‌కీయంగా కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. ఓ వైపు బీజేపీ వాళ్లు ఈ డైలాగులు తొల‌గించాల‌న్న డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఈ ఇష్య‌పై స్పందించిన క‌మ‌ల్‌హాస‌న్ బీజేపీ వాళ్ల‌పై విమ‌ర్శ‌లు చేస్తే, రాహుల్‌గాంధీ సైతం విజ‌య్ సినిమాకు మ‌ద్ద‌తుగా నిలిచి, ఆ డైలాగులు తొల‌గించ‌డం త‌మిళ సంస్కృతిని అవ‌మానించేమే అని చెప్పారు. ఈ సినిమాను చూస్తే విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీపై ఎంత ఆస‌క్తితో ఉన్నాడో అర్థ‌మైపోతుంది. పొలిటిక‌ల్ ఎంట్రీ ఉద్దేశంతో ఉన్న విజ‌య్ ఇలాంటి పంచ్‌లు పేలిస్తేనే అవి ఎంత సంచ‌ల‌నంగా మారాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

అయితే ఇప్పుడు తెలుగు జ‌నాలంద‌రూ ప‌వ‌న్‌ను, విజ‌య్‌ను పోలుస్తున్నారు. విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌కుండానే ఇలా పొలిటిక‌ల్ పంచ్‌లు పేల్చి జ‌నాల‌కు ద‌గ్గ‌ర‌వుతోంటే మ‌రోవైపు ఇప్ప‌టికే రాజ‌కీయ పార్టీ స్థాపించిన ప‌వ‌న్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, కాట‌మ‌రాయుడు లాంటి ప్లాప్ సినిమాలు తీసి అటు ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రుస్తూ ఇటూ జ‌నాల‌కు కూడా ద‌గ్గ‌ర కావ‌డం లేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వాస్త‌వానికి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చే హీరోలు ఇలా పొలిటిక‌ల్ బేస్‌డ్ పంచ్‌లు పేల్చితే ఆ కిక్కే వేరు. గ‌తంలో ఎన్టీఆర్ స‌ర్దార్ పాపారాయుడు సినిమాలో పేల్చిన పొలిటిక‌ల్ పంచ్‌లు ఆ త‌ర్వాత ఆయ‌న పాలిటిక్స్‌కు చాలా యూజ్ అయ్యాయి. ఇందుకు భిన్నంగా శంక‌ర్‌దాదా జిందాబాద్ సినిమా లాంటి కామెడీ సినిమా త‌ర్వాత పాలిటిక్స్‌లోకి వ‌చ్చిన చిరంజీవికి ఆ సినిమా ఎందుకూ ఉప‌యోగ‌ప‌డ‌లేదు.

దీంతో ఇప్పుడు ప‌వ‌న్ కూడా కాట‌మ‌రాయుడు, స‌ర్దార్ ఇలాంటి సినిమాలు కాకుండా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుకు మెర్స‌ల్ త‌ర‌హా సినిమాలు చేసి ఎన్నిక‌ల‌కు వెళితే అది అత‌డికి చాలా హెల్ఫ్ అవుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. గ‌తంలో కూడా కోలీవుడ్‌లో విజ‌య్ చేసిన క‌త్తి సినిమాను తెలుగులో రీమేక్ చేసేట‌ప్పుడు ముందుగా ప‌వ‌న్ పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆ సినిమా రైట్స్‌ను ప‌వ‌న్ స‌న్నిహితుడు శ‌ర‌త్‌మ‌రార్ తీసుకున్నాడు. త‌ర్వాత ఆ ఛాన్స్ కాస్తా చిరుకు ద‌క్కింది. ఇలా ప‌వ‌న్ ప్ర‌తిసారి మంచి క‌థాబ‌లం ఉన్న సినిమాలు వ‌దులుకుని, కోలీవుడ్‌లోనే జ‌నాలు తిర‌స్క‌రించిన సినిమాలు చేస్తుండడం ప‌వ‌న్ వీరాభిమానుల‌కే అస్స‌లు న‌చ్చ‌డం లేదు. మ‌రి ప‌వ‌న్ ఎన్నిక‌ల‌కు ముందు ఎలాంటి సినిమాలు చేస్తాడో ? చూద్దాం.