రోగ్‌ TJ రివ్యూ

సినిమా : రోగ్‌

నటీనటులు : ఇషాన్‌, మన్నారా చోప్రా, ఏంజెలా, నూప్‌సింగ్‌, ఆజాద్‌ ఖాన్‌, పోసాని కృష్ణమురళి, అలీ, సత్యదేవ్‌, సుబ్బరాజ్‌, రాహుల్‌ సింగ్‌, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు

ఆర్ట్‌ : జానీ షేక్‌

ఎడిటర్‌ : జునైద్‌ సిద్ధిఖీ

సినిమాటోగ్రఫీ : ముఖేష్‌.జి

మ్యూజిక్‌ : సునీల్‌కశ్యప్‌

నిర్మాతలు : సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి

దర్శకత్వం : పూరి జగన్నాథ్‌

శాండిల్ వుడ్ కి చెందిన ప్రొడ్యూసర్స్ CR  మనోహర్, CR గోపి ల మేనల్లుడు ఇషాన్ అనే  ఒక కొత్త కుర్రాడిని  హీరో గా తెలుగు సినిమాకి, కన్నడ సినిమా కి ఒకే సారి పరిచయం చేయటానికి డైరెక్టర్ పూరీజగన్నాధ్  చేసిన సినిమా నే ఈ  రోగ్.

డైరెక్టర్ పూరీజగన్నాధ్ తీసుకున్నఈ కథ తో ఇప్పటివకు చాలా సినిమాలే వచ్చాయి కాకపోతే ఇది పూరీ స్టయిల్ లో డిజైన్ చేసాడు. హీరో ఒక అమ్మాయిని లవ్ చేయటం, ఆ అమ్మాయి హీరోకి హ్యాండ్ ఇచ్చి ఇంకొకడిని పెళ్లి చేసుకోవటం దాన్తో హీరో కి అమ్మాయిలంటేనే ఇష్టంలేకుండా పోవటం జరుగుతుంది ఈ క్రమం లో తాను చేసినపని వల్ల ఒక కుటుంభం వీధినపడిందని తెలుసుకున్న హీరో ఆ కుటుంబానికి బాసటగా నిలవాలనుకుంటాడు ఆ క్రమం లో ఆ ఇంటిలోని  అమ్మాయి ఒక సైకోగాడి వేధింపుకు గురవుతుంది ఆ సైకోగాడినుంచి ఆ అమ్మాయిని కాపాడే క్రమంలో ఆ అమ్మయితో లవ్ లో పడిపోతాడు హీరో ఇది మొత్తంగా సినిమా కథాంశం.

అయితే హీరోలు అమ్మాయిలను ద్వేషించటం  ఇదంతా ఇంతకుముందు చాలా సినిమాలలో చూసాం కదా అనే ఉద్దెశంతోనో ఏమోకానీ సినిమా మొదటి 15 నిముషాల్లో ఇదంతా తేల్చేసాడు పూరీ. సినిమా మొదటిభాగం అంతా హీరో తనవల్ల నష్టపోయిన కుటుంభం కోసం చాలా రెస్పాన్సిబుల్ గా పనిచేయటం ఆ కుటుంబానికి తనంటే ఇష్టం లేకపోయినా తనపాటికి తాను అన్ని చక్కబెట్టుకుపోతూ ఉంటాడు ఇదంతా చూసి ఆ కుటుంభం లోని అమ్మాయి హీరోని ఇష్టపడుతుంది. ఇక్కడివరకు అంతా బాగానే సాగిపోతూ ఉంటుంది అయితే ఇక్కడే పూరికి పెద్ద చిక్కువచ్చినట్టుంది అమ్మాయిలను ద్వేషించే హీరో మళ్ళీ ప్రేమలో పడాలంటే ఏంచేయాలో అర్ధం కాకా ఒక సైకోగాడిని రంగంలోకి దింపుతాడు.

ఇక సెకండ్ హాఫ్ అంతా హీరో సైకోగాడి మధ్యలో సినిమాని నడిపించేసి హీరోయిన్ ని సైకోగాడినుండి రక్షించటానికన్నట్టు ఎవరూ ఉండని ప్రదేశం లో  హీరో హీరోయిన్ కలిసి ఉండటానికి కొన్ని సీన్లు పెట్టేసి హీరో కూడా లవ్ లో పడేటట్టు చేసి సినిమాని క్లైమాక్స్ కి తీసుకొస్తాడు.

ఇక సినిమా లో ని క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే  హీరోగా మొదటిసినిమానే అయినప్పటికీ చాలా ఈజ్  తో చేసాడు ఇషాన్. సినిమా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు కొత్త హీరో సినిమా చూస్తున్నామన్న ఫీల్ కూడా కలగదు. . కాబట్టి తనకిచ్చిన క్యారెక్టర్ కి వంద శాతం న్యాయం చేసాడు ఇషాన్. ఇంకా హీరోయిన్ గా  చేసిన మన్నారా చోప్రా తన అందంతో ఆకట్టుకుంది. రెండో హీరోయిన్ గా చేసినా ఏంజెలా అందాల ఆరబోతకు మాత్రమే పరిమితమయ్యింది . ఆలీ కామిడీ రొటీన్ గానే వుంది. ఠాకూర్ అనూప్ సింగ్ సైకోగా న్యాయం చేసాడు. మిగిలిన పాత్రలన్నీ ఓకే అనిపించాయి.

ఫైనల్ గా చెప్పాలంటే రెగ్యులర్ పూరీ సినిమా. పూరి సినిమాలలో హీరో క్యారెక్టర్ అంటే అది మిగిలిన సినిమాలలో విలన్ క్యారెక్టర్ లా ఉంటుంది. సినిమా లో కథ ఎలాంటిదయినా హీరో మాత్రం ఒకలాగానే ఉంటాడు యారొగెంట్ గా. అది ఏ రేంజ్ లో అంటే  అమ్మానాన్నలను సైతం లెక్కచేయకుండా ఉండేంత యారొగెంట్ గా ఇది మొదటి ఒకటి రెండు సినిమాలకి బాగానే వున్నా ఇప్పుడు అది కూడా జనాలకి బోరుకొట్టి చాలాకాలమయ్యింది. ఎన్ని సినిమాలు చేసినా పూరీకి మాత్రం అది బొర్ కొట్టటం లేదు.

పంచ్ లైన్ : సెకండ్ హ్యాండ్ రోగ్

రేటింగ్ : 2 .5 /5