అంధ‌గాడు సూప‌ర్ హిట్‌: ఫ‌స్ట్ డే వ‌సూళ్ల లెక్క అదుర్స్‌

రాజ్‌త‌రుణ్ – హెబాప‌టేల్ కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మ‌నం కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం – ఆడోర‌కం సినిమాల‌తో చూశాం. వీరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఈ రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి వీరి కాంబోలో అంధ‌గాడు సినిమా తెర‌కెక్కింది.

ప్ర‌ముఖ స్టోరీ రైట‌ర్ వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా మారి తెర‌కెక్కించిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యింది. సినిమాకు మంచి టాక్ రావ‌డంతో రాజ్ త‌రుణ్ కెరీర్‌లోనే బెస్ట్ ఫ‌స్ట్ డే ఓపెనింగ్స్ సాధించింది. శుక్ర‌వారం అంధ‌గాడు

ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 3.75 కోట్ల వసూళ్లను సాధించింది.

అంధ‌గాడు సినిమాలోని మలుపులు, సస్పెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమా రాజ్‌త‌రుణ్ కెరీర్‌లోనే మ‌రో మంచి చిత్రంగా నిలిచిపోనుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అప్పుడే లెక్క‌కు వ‌చ్చేశాయి.