‘ రాజా ది గ్రేట్ ‘ 5 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్‌

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ రాజా ది గ్రేట్ ఐదు రోజుల‌కే దాదాపు సేఫ్ జోన్‌లోకి వ‌చ్చేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. ర‌వితేజ రెండేళ్ల త‌ర్వాత న‌టించిన సినిమా కావ‌డంతో పాటు సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా మంచి వ‌సూళ్లు ఈ సినిమాకు ద‌క్కుతున్నాయి. ఐదు రోజుల‌కే ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 21 కోట్ల షేర్ రాబ‌ట్టి అంద‌రికి షాక్ ఇచ్చింది. ర‌వితేజ కెరీర్‌లో క‌లెక్ష‌న్ల ప‌రంగా టాప్ సినిమాలు అయిన ప‌వ‌ర్ – బుల‌పు – బెంగాల్ టైగ‌ర్ వ‌సూళ్లు రూ.25 కోట్ల‌కు కాస్త అటూ ఇటూగానే ఉన్నాయి.

రాజా ది గ్రేట్ మాత్రం 5 రోజుల‌కే రూ.21 కోట్ల షేర్ రాబ‌ట్ట‌డంతో సినిమాకు మంచి లాభాలు రానున్నాయి. మొత్తానికి దిల్ రాజుకు ఈ యేడాది మ‌రో హిట్ వ‌చ్చింది. ఇక ఈ సినిమా కొన్న బ‌య్య‌ర్లు కూడా సేఫ్ జోన్‌కి ద‌గ్గ‌ర‌గా ఉన్నారు.

ఐదు రోజుల వరల్డ్ వైడ్ షేర్ (రూ.కోట్ల‌లో)

నైజాం – 7.80

సీడెడ్ – 2.80

నెల్లూరు- 0.65

గుంటూరు – 1.27

కృష్ణా – 1.25

వెస్ట్ – 1.10

ఈస్ట్ – 1.39

యూఎస్ఏ – 2.27

ఓవర్సీస్ – 0.73

రెస్టాఫ్ ఇండియా – 1.65

———————————————-

5 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ = 20.91 కోట్లు

———————————————-