2017కు రాజ‌మౌళి ఫేవ‌రెట్ సినిమా తెలిస్తే షాకే

December 12, 2017 at 4:05 pm
rajamouli, favorite movie, bahubali 2, arjun reddy

దర్శక ధీరుడు రాజమౌళి నటీ నటులు, దర్శకులు ఎవరైనా సరే సినిమా బాగుంటే సోష‌ల్ మీడియాలో ఆకాశానికి ఎత్తేస్తుంటారు. సినిమా టీజ‌ర్లు, ట్రైల‌ర్లు, సినిమా బాగుంటే రాజ‌మౌళి త‌న ట్వీట్ట‌ర్‌లో దానిని ప్ర‌శంసిస్తూ పోస్టులు పెడుతుంటారు. చాలా చిన్న సినిమాల‌కు రాజ‌మౌళి త‌న‌వంతుగా ప్ర‌మోష‌న్ చేశారు. రాజ‌మౌళికి కాన్సెఫ్ట్ న‌చ్చితే చాలు ఎంత చిన్న హీరోలు, ద‌ర్శ‌కులు అయినా ఆ సినిమాను మెచ్చుకుంటున్నారు.

రాజ‌మౌళి ప్ర‌మోష‌న్ చాలా సినిమాల‌కు హెల్ఫ్ అయ్యింది కూడా. ఈ విష‌యంలో రాజమౌళిని మెచ్చుకోవాల్సిందే. రాజ‌మౌళికి ఈ యేడాది జీవితంలో మ‌ర్చిపోలేని అనుభూతి బాహుబ‌లి 2 రూపంలో ద‌క్కింది. బాముబ‌లి 2 సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.1800 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో పాటు ఇండియ‌న్ సినిమాల రికార్డుల‌న్నింటిని పాత‌రేసేసింది.

బాహుబ‌లి 2 దెబ్బ‌కు సౌత్ సినిమాల‌ను చిన్న చూపు చూస్తూ విర్ర‌వీగే బాలీవుడ్ మూగ‌బోయింది. మ‌రి అలాంటి బాహుబ‌లి 2 సినిమా తీసిన రాజ‌మౌళికి ఈ యేడాది ఫేవ‌రెట్ సినిమా ఏదో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. రాజమౌళికి 2017లో వ‌చ్చిన సినిమాల‌న్నింటిలోకి  విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన అర్జున్‌రెడ్డి సినిమా ఆయ‌కు బాగా న‌చ్చేసింద‌ట‌.

ఈ యేడాది ఆగ‌స్టులో చిన్న సినిమాగా రిలీజ్ అయిన అర్జున్‌రెడ్డి సినిమా రిలీజ్ రోజునే మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా చాలా త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి రూ.25 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ సినిమాను తొలి రోజే చూసిన రాజ‌మౌళి ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించిన విజయ్ దేవరకొండ, షాలిని పాండేలకు మంచి బ్రేక్ దొరికి వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు.

 

2017కు రాజ‌మౌళి ఫేవ‌రెట్ సినిమా తెలిస్తే షాకే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share