‘గ‌రుడవేగ’ సండే సీన్ రివెర్స్

యాంగ్రీ యంగ్‌మేన్ డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ గ‌రుడ‌వేగ హిట్‌తో ఊగిపోతున్నాడు. ఈ సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీతో పాటు టోట‌ల్ చిత్ర‌యూనిట్ అయితే ఏకంగా డ్యాన్సులు చేస్తూ సంబ‌రాలు చేసుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు రోజు రోజుకు వ‌సూళ్లు అంచ‌నాల‌కు మించి పెరుగుతున్నాయి. తొలి రోజు ఈ సినిమా రూ.కోటి లోపే షేర్ రాబ‌ట్టింది. ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి దిగిన గ‌రుడ‌వేగకు పోటీగా నెక్ట్స్ నువ్వే, ఏంజెల్ సినిమాలు కూడా రావ‌డంతో గ‌రుడ‌వేగ‌కు 250 స్క్రీన్లే దొరికాయి. తొలి ఆట నుంచే సూప‌ర్ హిట్ టాక్ రావ‌డంతో రెండో రోజు నుంచి సింగిల్ స్క్రీన్ల‌తో పాటు మ‌ల్టీఫ్లెక్స్‌ల‌లో సైతం షోలు పెంచారు. దీంతో వ‌సూళ్లు కూడా బాగా పెరిగాయి.

తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు రెట్టింపు వసూళ్లు వచ్చాయి. ఇక మూడో రోజు సండే అయితే గ‌రుడ‌వేగ‌కు సూప‌ర్ సండే అయ్యింది. మూడో రోజు ఈ సినిమా ఆడుతున్న అన్ని థియేట‌ర్ల‌లోను అన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. ముందు వారం వ‌చ్చిన రామ్ ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ స్లో అయిపోవ‌డం, గ‌రుడ‌వేగ‌కు పోటీగా రిలీజ్ అయిన నెక్ట్స్ నువ్వే – ఏంజెల్ ప్లాప్ అవ్వ‌డంతో ఈ సినిమాకు తిరుగులేకుండా పోయింది.

ఆదివారం మాత్రం సినిమా వ‌సూళ్లు అదిరిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఫ‌స్ట్ వీకెండ్ పూర్తి వ‌సూళ్ల వివ‌రాలు బ‌య‌ట‌కు రాన‌ప్ప‌ట‌కీ రూ. 5-6 కోట్ల వ‌ర‌కు గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల ప్రాథ‌మిక అంచ‌నా. ఇక సోమవారం నుంచి సినిమా ఎలా ఆడుతుందన్నది కీలకం. ఇక సినిమాకు రూ.25 కోట్ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టిన‌ట్టు చెపుతున్నారు. మ‌రి ఈ సినిమా టాక్ బాగుండ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత వ‌ర‌కు సేఫ్ అవుతుందో ? చూడాలి.