2.0 తెలుగు..ఆ ముగ్గురి చేతుల్లో!

November 1, 2018 at 3:41 pm

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ హీరోగా, అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తున్న చిత్రం రోబో-2, రోబోకు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రం విడుద‌ల సిద్ధ‌మ‌వుతోంది. అయితే.. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు ఎవ‌రు విడుద‌ల చేస్తారు..? అన్న విష‌యంలో కొంత క్లారిటీ మిస్ అవుతోంది. నిజానికి కొన్నిరోజుల కింద‌ట‌.. ఈ సినిమాను తెలుగులో ఏషియ‌న్ సునీల్ విడుద‌ల చేస్తార‌ని, తెలుగు హ‌క్కుల‌ను రూ.81కోట్ల‌కు తీసుకున్న‌ట్లు తీసుకున్నారు. కానీ.. తాజాగా మార్పులు వ‌చ్చాయి. దీని నుంచి ఏషియ‌న్ సునీల్ త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈమేర‌కు ఆయ‌న ఇచ్చిన మొత్తంలో కొంత అడ్వాన్స్ కూడా వెన‌క్కి తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

21541041122.0-teaser-rajini-akshay

ప్ర‌స్తుతం రోబో-2 తెలుగు హ‌క్కుల‌ను లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఎన్వీ ప్ర‌సాద్‌కే అప్ప‌గించడం గ‌మ‌నార్హం. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో ఎన్వీ ప్ర‌సాద్‌కు ఉన్న స‌న్నిహిత సంబంధాలు అంద‌రికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తెలుగు హ‌క్కుల్ని ఈయ‌న‌కు అప్ప‌జెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా.. ర‌జ‌నీకాంత్ న‌టించిన కాలా సినిమాకు సంబంధించి సుమారు రూ.17కోట్లు ఎన్వీ ప్ర‌సాద్‌కు లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా ఏషియన్ సునీల్ కు కూడా ఇవ్వాల్సిన రూ.13కోట్ల వ్యవహారం ఉంది. అయితే మొత్తం ఈ రూ.30కోట్లు పోను మిగిలిన రూ.50కోట్ల‌ను రికవరబుల్ అడ్వాన్స్ గా పంపించమని లైకా ప్రొడక్షన్స్ అడుగుతోంద‌ట‌.

అంటే ఇక్క‌డ ఏషియ‌న్ సునీల్‌కు ఇవ్వాల్సిన డ‌బ్బును ఎన్వీ ప్ర‌సాదే ఇస్తాడ‌న్న‌మాట‌. అయితే.. ఎన్వీ ప్ర‌సాద్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌కు ఎంత డ‌బ్బు అప్ప‌గిస్తాడు అనే దానిపైనే రోబో -2 తెలుగు హ‌క్కులు ఎంత మొత్తానికి అమ్ముడు పోయాయో తెలుస్తుంది. నిజానికి.. రోబో-2 సినిమా విడుద‌ల ఆల‌స్యం కావ‌డం వ‌ల్లే ఈ స‌మ‌స్య వ‌చ్చిప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇందువ‌ల్లే రూ.81కోట్ల‌కు అవుట్ రేట్‌కు అమ్ముకోవాల్సిన రోబో-2ను రిక‌వ‌రబుల్ అడ్వాన్స్ మీద పంపిణీ చేయాల్సిన ప‌రిస్థితి లైకా ప్రొడ‌క్ష‌న్స్‌కు ఏర్ప‌డింది. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమిటంటే.. దిల్ రాజు, యూవీ వంశీ కూడా ఎన్వీప్ర‌సాద్‌తో పాలుపంచుకుంట‌న్న‌ట్లు తెలుస్తోంది. చూద్దాం మ‌రి ఏం జ‌రుగుతుందో..!

2.0 తెలుగు..ఆ ముగ్గురి చేతుల్లో!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share