రజిని 2 .0 స్టోరీ ఇదే..ఎవరు ఊహించని విధంగా!

September 19, 2018 at 11:40 am

ఈ మద్య స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలు రిలీజ్ కన్నా ముందే నానా హంగామాలు సృష్టిస్తున్నాయి. ఫోలో టీక్స్, టీజర్ లీక్స్..చివరికి ఇదే కథ అంటూ రక రకాల కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తీరా థియేటర్లోకి వెళ్లి చూస్తే కాని అసలు విషయాలు బయటకు రావు. తాజాగా శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న రోబో 2.0 సినిమాకు సంబంధించి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది.

47

గతంలో శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన రోబో సినిమాలో ఓ రోబోకి మనసు ఉంటే ఎలా ఉంటుందని ప్రయోగం చేశారు..కానీ అది ఆ శాస్త్రవేత్తకే ఎదురి తిరిగే పరిస్థితి రావడంతో దాన్ని డిస్ మెటల్ చేస్తారు. తాజాగా దీని సీక్వెల్ ఎలా ఉంటుందీ అన్నదే 2.0 కథ. రోబో క్లైమాక్స్ లో విలన్ గా మారిన చిట్టి సీక్వెల్ కి వచ్చేసరికి మళ్లీ హీరోగా మారుతున్నాడు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పక్షి పాత్రలో విలన్ గా నటిస్తున్నాడు. ట్రైలర్ లో కూడా ఇంతవరకే చూపించారు. అయితే సెల్ ఫోన్లు మాయం అనే కాన్సెప్ట్ మాత్రం కాస్త కొత్తగా తోచింది.

sfdsf

ఇక శాస్త్రవేత్త అయిన రజినీకాంత్ జరుగుతున్న పరిణామాలకు చిట్టి ద రోబో ని రంగంలోకి దింపాలని సూచించిడం..చిట్టి రోబో మళ్లీ పునరాగమనం..తో టీజర్ అదిరిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా సెల్ ఫోన్ల వినియోగం పెరిగిపోవడం, ఇబ్బడిముబ్బడిగా సెల్ టవర్లు నిర్మించడం, ఈ రేడియేషన్ వల్ల కలిగే విపరీతాలు, నష్టాలే కథాంశంగా 2.0 సినిమాను తెరకెక్కించాడట దర్శకుడు శంకర్.

అయితే రాను రాను తమ సంతతి తగ్గిపోతుందని..పక్షులు అన్నీ కలిసి మానవులపై చేసే యుద్దం..2.0. పక్షిరాజు అక్షయ్ నాయకత్వంలో పోరాటానికి దిగుతాయి. ఈ అనర్థాన్ని అరికట్టడానికి హీరో రజనీకాంత్ తాను నాశనం చేసిన చిట్టిని తిరిగి బయటకి తీసుకొస్తాడు. దానికి కొత్త శక్తులు ఇచ్చి పక్షిరాజుతో యుద్ధం చేయిస్తాడు. అయితే పక్షి రాజుపై చిట్టి రోబో గెలుస్తాడా..చివరికి ఎం జరుగుతుందనేది సస్పెన్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కథ నిజమో కాదో తేలాలంటే రోబో 2.0 విడుదల వరకూ వేచి చూడాల్సిందే.

రజిని 2 .0 స్టోరీ ఇదే..ఎవరు ఊహించని విధంగా!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share