ముందే చెప్పిన రాజ‌మౌళి.. అంతుచిక్క‌ని ఆంత‌ర్యం..!

March 15, 2019 at 10:58 am

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌న స‌హ‌జ‌శైలికి భిన్నంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా విష‌యాలు వెల్ల‌డించారు. న‌టీన‌టులతోపాటు వారి పాత్ర‌లు ఏమిటి..? ఎలా ఉండ‌బోతున్నాయ‌న్న విష‌యంలోనూ ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. కానీ.. రాజ‌మౌళి ఇలా ముందే సినిమా విష‌యాల‌ను వెల్ల‌డించ‌డంలో ఆంత‌ర్యం ఏమిన్న‌ట‌ది ఇండ‌స్ట్రీవ‌ర్గాల‌తోపాటు ప్రేక్ష‌కుల‌కు కూడా అంతుబ‌ట్ట‌డం లేదు. తాను ఏదైనా ప్రాజెక్టు చేప‌డితే.. దానికి సంబంధించిన చిన్న విష‌యం కూడా బ‌య‌ట‌కు రాకుండా.. జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేస్తూ.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో చిన్న లీకులు ఇస్తూ.. ప్రేక్ష‌కుల్లో ఉత్సుక‌త‌ను రేకెత్తించే రాజ‌మౌళి.. ఏకంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా విశేషాల‌న్నింటినీ వెల్ల‌డించ‌డంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
1
ఆర్ ఆర్ ఆర్ లో రాంచ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఇన్ని రోజులూ అస‌లు క‌థ ఎలా ఉండ‌బోతున్న‌ది..? వారిని ఎలా చూపించ‌బోతున్నార‌న్న విష‌యాల‌పై అనేక ఊహాగానాలు వినిపించారు. నిజానికి.. మ‌ల్టీస్టార‌ర్ మూవీ కావ‌డంతో రాంచ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ పాత్ర‌ల‌పై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. దీనిని ఇలాగే కొన‌సాగించ‌కుండా.. ఒక్క‌సారిగా రాజ‌మౌళి మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి మ‌రీ వివ‌రాలు వెల్ల‌డించ‌డంలో అస‌లు గుట్టు ఏమిటో ఎవ్వ‌రికీ అంతుచిక్క‌డం లేదు. అన్ని విష‌యాలు ముందే చెప్పిన త‌ర్వాత సినిమాలో రాజ‌మౌళి చూపించ‌డానికి ఏముంటుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ విష‌యంలో జ‌క్క‌న్న వ్యూహాత్మ‌క త‌ప్పిందం చేసిన‌ట్టేన‌ని ఇండ‌స్ట్రీవ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి.
2
అల్లూరి సీతా రామరాజుగా రాంచ‌ర‌ణ్‌, కోమ‌రం భీంగా ఎన్టీఆర్ న‌టిస్తున్న‌ట్లు రాజ‌మౌళి వెల్ల‌డించారు. నిజానికి.. అల్లూరి, కొమ‌రం భీం చ‌రిత్ర ఆధారంగా ప‌లు సినిమాలు, న‌వ‌ల‌లు ఇప్ప‌టికే వ‌చ్చేశాయి. సూప‌ర్‌స్టార్ కృష్ణ న‌టించిన అల్లూరి సీతారామారాజు సినిమా తెలుగు ప్రేక్ష‌కుల్లో చెర‌గ‌ని ముద్ర వేసింది. అయితే.. అల్లూరి, కొమరం భీం పోరాట యోధులుగా మారటానికి ముందు కొంత కాలం ప్రపంచానికి దూరంగా వెళ్లిపోయారని.. ఆ సమయంలో వారు ఎక్కడున్నారు, యోధులుగా మారటానికి దారి తీసిన సంఘటనల నేపథ్యంలో ఈ కథను తయారు చేసుకున్నట్టుగా రాజ‌మౌళి చెప్పారు. కానీ, ఇప్పుడు రాజ‌మౌళి గుప్పిట ప‌ట్టిన విష‌యం ఏమిటంటే.. వారు ఎక్క‌డ ఉన్నారు..? ఏం చేశార‌న్న‌దే. ఈ విష‌యంలో రాజ‌మౌళి కొత్త చ‌రిత్ర‌ను లిఖిస్తారా..? లేక వ‌క్రీక‌రించి విమ‌ర్శ‌ల పాల‌వుతారా..? అన్న‌ది తెలియాలంటే.. 2020వ‌ర‌కు ఆగాల్సిందే మ‌రి.

ముందే చెప్పిన రాజ‌మౌళి.. అంతుచిక్క‌ని ఆంత‌ర్యం..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share