రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ టీజర్

March 18, 2018 at 2:13 pm
rajugadu

రాజ్ తరుణ్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చే సినిమా ఉయ్యాలా జంపాల, కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి హిట్ అందుకొని టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు ఈ వైజాగ్ కుర్రాడు. ఆ తరువాత సినిమా చూపిస్త మామ అంటూ కుమారి 24 F సినిమాలతో హాట్రిక్ కొట్టి, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక్కడితో మన హీరో సినిమా అయిపోయింది అని చెప్పాలేమో, ఎందుకంటే మనోడు ఆ తరువాత తీసిన సినిమాలు థియేటర్స్ లో ఒక్క వారం కూడా ఆడలేదేమో…మొన్న సంక్రాంతికి పందెంలో పోటీ పడ్డ రంగుల రాట్నం బొక్క బోర్లా పడింది.

మరి ఈ టైం లో మనోడు రాజుగాడు అంటూ ఒక టీజర్ రిలీజ్ చేసాడు, ఇది చూస్తుంటే ఇంతక ముందు మనోడు చేసిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త అదే విదంగా రంగుల రాట్నం సినిమాల వాసనలు బాగా వస్తున్నాయి. అవి చూస్తే డిజాస్టర్స్ అయ్యాయి. మరి చూడాలి ఈ రాజుగాడు ఎగిరి గంతేస్తాడో లేక బొక్క బోర్లా పడతాడో…

రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ టీజర్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share