రామ్‌చరణ్ బీభత్సం అక్కడే

September 5, 2018 at 11:38 am

మెగా పవర్ స్టార్ రామ్‌‌చరణ్ హీరోగా కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. డి.వి.వి.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ లో బోయపాటికి ఓ ప్రత్యేకత ఉంది..ఆయన డైరెక్షన్లో హీరోని ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తారు. అందుకే బోయపాటితో ఒక్క సినిమాలో అయినా నటించాలని తహ తహలాడుతుంటారు.

తాజాగా రామ్‌చ‌ర‌ణ్ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్ర‌స్తుతం యూరోపియ‌న్ దేశ‌మైన అజ‌ర్ బైజాన్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. అక్క‌డ దాదాపు నెల రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రుపుతారు. ఆ మద్య అజర్ బైజాన్ షెడ్యూల్ గురించి అంతకుముందు నిర్మాత డి.వి.వి.దానయ్య మీడియాతో మాట్లాడారు. రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా అనగానే మెగా అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయని, వాటిని మించేలా సినిమాను తెరకెక్కిస్తున్నామని దానయ్య చెప్పారు.

885

‘ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాను తీస్తున్నాం. ఇక తన స్నేహితుల నుంచి ఈ ప్రాంతం గురించి విన్న బోయపాటి ప్రత్యకంగా రెక్కీ నిర్వహించి, లోకేషన్లు ఎంచుకున్నారట. ఇక్కడ షూట్ చేసే సీన్లో అధికశాతం యాక్షన్ ఎపిసోడ్ లే వుంటాయి. సినిమా మొత్తంమీద అయిదారు యాక్షన్ ఎపిసోడ్ లు వుంటాయని, అవి సినిమాకే హైలైట్స్ గా ఉంటాయని అంటున్నారు. గతంలో రాంచరణ్ నటించిన మగధీర సినిమాలో వంద మందిని ఒంటి చేత్తో ఎదిరించే కాల భైర‌వ గుర్తొస్తాడు.

ఆ ఎపిసోడ్ ‘మ‌గ‌ధీర‌’ని ఎక్క‌డికో తీసుకెళ్లిపోయింది. దాన్ని మించేలా ఓ యాక్ష‌న్ ఎపిసోడ్ ని రూపొందిస్తున్నాడ‌ట బోయ‌పాటి. మొత్తానికి రామ్‌చ‌ర‌ణ్ సినిమాలో నాలుగు యాక్ష‌న్ ఎపిసోడ్లు ఉన్నాయ‌ట‌. నాలుగూ… వేర్వేరు స్టైల్స్‌లో సాగుతూ మాస్‌ని అల‌రిస్తాయని, అజ‌ర్ బైజాన్ ఎపిసోడ్ మాత్రం క్లైమాక్స్ కోసం కేటాయించార‌ని తెలుస్తోంది.

రామ్‌చరణ్ బీభత్సం అక్కడే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share