‘చెర్రీ – బోయపాటి’ దీవాళీ బాంబు షురూ!

November 5, 2018 at 4:23 pm

ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’బాక్సాఫీస్ ని షేక్ చేసింది. చెవిటి వాడి పాత్రలో చిట్టిబాబుగా రాంచరణ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. విమర్శకుల నుంచి ప్రశంసలు పొందారు. రాంచరణ్ కెరీర్ లో రెండువందల కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా ‘రంగస్థలం’నిలిచిపోయింది. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న చరణ్ మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు.

DrOuFQRVsAAnJte

పలు సందర్భల్లో రాంచరణ్ సినిమా ఫస్ట్ లుక్ వస్తుందని ఎన్నో అశలు పెట్టుకున్న ఫ్యాన్స్ ప్రతిసారీ నిరాశకు లోనవుతూ వచ్చారు. సినిమా ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందా కాదా అన్న సందోహంలో పడిపోయారు ఫ్యాన్స్. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెర పడనుంది.ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ విడుదల వివరాలని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. నవంబర్ 6 అంటే రేపు మధ్యాహ్నం 1 గంటకు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.

అదే విధంగా నవంబర్ 9 ఉదయం 10.25 గంటలకు టీజర్ విడుదల చేయనుండడం విశేషం. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఆర్యన్ రాణేష్, స్నేహ కీలకపాత్రల్లో నటిస్తున్నాడు. భరత్ అనే నేనుతో తెలుగు తెరకు పరిచయమైన కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

‘చెర్రీ – బోయపాటి’ దీవాళీ బాంబు షురూ!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share