బోయపాటికి షాక్ ఇచ్చిన చెర్రీ!

July 11, 2018 at 11:19 am
Ram charan, Boyapati srinu, movie, Budget, cost cutting

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలంటే భారీ బడ్జెట్ తో కూడుకున్నవై ఉంటాయి. సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రాంచరణ్ తాజాగా మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బోయపాటి అంటే యాక్షన్ సీన్స్ భారీస్థాయిలో ఉంటాయని అందరికీ తెలుసు..ఇక నిర్మాత పెట్టుబడి పెట్టాలే కానీ హాలీవుడ్ రేంజ్ లో సీన్ క్రియేట్ చేయాలని చూస్తాడు బోయపాటి.

గతంలో బాలయ్యతో యాక్షన్ సీన్లు ఏ రేంజ్ లో క్రియేట్ చేశారో తెలిసిందే. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాకు డివివి నిర్మాత. ఇక సినిమా కూడా భారీ బడ్జెట్ దాదాపు వంద కోట్లు అంచన. మరో వైపు చరణ్ ‘రంగస్థలం’ హిట్ తో జోష్ మీద ఉన్నాడు. ఇదిలా ఉంటే..ఈ సినిమాకు ఓపెనింగ్ సీన్ తోనే భయంకరంగా ఖర్చు చేయించడం ప్రారంభించారని వినికిడి. విలన్ ఎంట్రీ సీన్ అయిన బహిరంగ సభ కోసం కోట్లు ఖర్చు చేయించారని టాక్.

అయితే ఇప్పుడు సినిమా మూడు వంతులు పూర్తయ్యాక మాత్రం ఖర్చు మీద ఫుల్ కంట్రోల్ స్టార్ట్ అయిందని తెలుస్తోంది. ఈ మద్య చాలా మంది స్టార్ హీరోలు సాద్యమైనంత వరకు బడ్జెట్ విషయంలో నిర్మాతలను సేవ్ చేయాలని చూస్తున్నారు..కొంత మంది రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనుకున్న బడ్జెట్ కన్నా పది కోట్లు కచ్చితంగా తగ్గాలని రామ్ చరణ్ క్లియర్ గా డైరక్టర్ బోయపాటికి చెప్పారట.

నిర్మాతకు కాస్తయినా లాభం మిగలాలని, మార్కెట్ వుంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయించవద్దని చరణ్ చెప్పినట్లు తెలుస్తోంది. బోయపాటి లాస్ట్ సినిమా జయజానకీ నాయక సినిమాకు నలభై కోట్లకు పైగా ఖర్చు అయింది. సినిమా హిట్ అయినా..కమర్షియల్ గా లాభపడలేదు. దమ్ము సినిమా సంగతి తెలిసిందే. కాకపోతే సరైనోడు ఒక్కటే నిర్మాత హ్యాపీ అయిన సినిమా అని చెప్పుకోవాలి.

బోయపాటికి షాక్ ఇచ్చిన చెర్రీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share