లాస్ట్ మినిట్ లో అంతా మార్చేసిన బోయపాటి!

November 7, 2018 at 9:36 am

ఒక్కో ద‌ర్శ‌కుడిది ఓక్కో మార్క్‌. ఇందులో బోయ‌పాటిది మాస్ మార్క్‌. బోయ‌పాటి హీరో అంటేనే కండ‌లు తిరిగి.. చేతిలో క‌త్తిప‌ట్టి.. అదిరిపోయే రేంజ్‌లో ఉంటాడు. తాజాగా రాంచ‌ర‌ణ్‌తో తెర‌కెక్కిస్తున్న `విన‌య విధేయ రామ‌` సినిమా ఫ‌స్ట్ లుక్ ని మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. ఇక్క‌డ ట్విస్ట్ ఏమిటంటే.. సినిమా పేరేమో సాఫ్ట్ గా ఉంది.. ఫ‌స్ట్‌లుక్ మాత్రం హార్డ్‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డే అభిమానులు కంగుతిన్నారు. ఇదేమిటి.. బోయాపాటి ఇలా చేశాడేంటి.. అని కొంత నిరాశ‌కు గుర‌వుతున్నారు.

ramcharan-look1541492302 (1) copy

పేరుకు త‌గ్గ‌ట్టుగా ఫ‌స్ట్‌లుక్ కూడా సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఉంటే బాగుండేద‌ని, పండుగ‌పూట రాంచ‌ర‌ణ్‌ని అలా చూపిస్తే బాగుండున‌ని అంటున్నారు. అలాగే.. ఈ స్టైల్‌లో రాంచ‌ర‌ణ్ కొత్త‌గా ఏమీ లేడ‌ని, ఆయ‌న గ‌త సినిమాల్లోనూ ఇలాంటి లుక్ ఉంద‌ని చెబుతున్నారు. నిజానికి.. బోయ‌పాటి ఎప్పుడుకూడా త‌న సినిమాల్లో హీరోని కొత్త‌లుక్ లో చూపిస్తాడు. ఇప్పుడు కూడా అదే చేస్తాడ‌ని, రాంచ‌ర‌ణ్‌ని ఎలా చూపిస్తాడోన‌ని ఎంతో ఆత‌`త‌గా అభిమానులు ఎదురు చూశారు. కానీ.. తీరా చూశాక ఇలా ఉందేంటి అని అంటున్నారు.

నిజానికి.. విన‌య విధేయ రామ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ని మొద‌ట సాఫ్ట్‌గా ఉండేలాగే డిజైన్ చేశార‌ట‌. కానీ.. ఎందుకోగానీ.. చివ‌రి నిమిషంలో అప్ప‌టిక‌ప్పుడు ఈ మాస్‌లుక్ వ‌చ్చేలా డిజైన్ చేయించార‌ట‌. రాంచ‌ర‌ణ్‌ని మాస్‌లుక్‌లో చూస్తేనే అభిమానులు ఇష్ట‌ప‌డుతార‌ని బోయ‌పాటి భావించిన‌ట్లు తెలిసింది. కానీ.. వారి స్పంద‌న మాత్రం భిన్నంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో త్వ‌ర‌లోనే మొద‌ట త‌యారు చేయించిన సాఫ్ట్‌లుక్‌ని కూడా విడుద‌ల చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ న‌టిస్తోంది.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌పై మ‌రో టాక్ కూడా వినిపిస్తోంది. టైటిల్‌ని బ‌ట్టి.. హీరో క్యారెక్ట‌ర్ విన‌య విధేత‌లు చూపెట్టేలా ఉంటుంద‌ని అనుకుంటాం. ఇదే స‌మ‌యంలో తేడా వ‌స్తే.. ఎంత‌టి విధ్వంసం స‌`ష్టించేందుకైనా విన‌కాడ‌బోడ‌ని ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌తో బోయ‌పాటి క్లారిటీ ఇచ్చాడ‌నే టాక్ కూడా వినిపిస్తోంది. కాగా, `అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ‘వినయ విధేయ రామ’ వస్తున్నాడు. సంక్రాంతికి కలుద్దాం..` అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఇక ఈ సినిమాలో స్నేహ, ఆర్యన్‌ రాజేశ్, వివేక్‌ ఒబెరాయ్ న‌టిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

లాస్ట్ మినిట్ లో అంతా మార్చేసిన బోయపాటి!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share