చెర్రీకి టైటిల్ కొత్తగా ఉంది కానీ వారికి అది పాతే

రామ్ చరణ్ సుకుమార్ కలయికలో వస్తున్న సినిమాకు టైటిల్ తయారైపోయింది. టైటిల్ కొత్తగా ఉన్న అది పాత సినీ తారల అనుభవాన్ని గుర్తుకు తెచ్చే విధంగా ఉంది. ధృవ వంటి హిట్ కొట్టిన రాంచరణ్ ఇలాంటి కొత్త కాన్సెప్టుకి ఓకే చేసాడు అంటే ఒకింత ఆశ్చర్యం కలగక మానదు, ఇక సుకుమార్ గురించి చెప్పుకుంటే లెక్కల మాస్టర్ అన్ని లెక్కలు వేసుకుంటూ సినిమా తీస్తాడు అంటే అతిసయోక్తే, ఏ సినిమా చేసినా అందులో కొత్తదనం కోసం పరితపించే అతి కొద్దిమంది దర్శకుల్లో సుకుమార్‌ని ప్రత్యేకంగా చెప్పుకుని తీరాల్సిందే.

ఇక చరణ్ సినిమా గురించి చెప్పుకుంటే ఈ సినిమాకి ‘రంగస్థలం 1985 ‘ అనే టైటిల్ ఖరారు చేశారు, చూస్తుంటే ఇదేదో ఆ కాలానికి సంబంధించిన నాటకాల ప్రస్తావన సినిమాలో చూడబోతున్నామా.? అన్న అనుమానం ప్రతి ఒక్కరికి రాక మానదు. ఏమో చెప్పలేం అల్లుఅర్జున్ని లవర్ బాయ్ లాగ, ఎన్టీఆర్ ని జెంటిల్ మెన్ లాగ చూపియ్యడం సుక్కుకే  చెల్లింది. ఇప్పుడు ఈ పాతకాలపు నాటకాలతో చెర్రీ కి ఏ ఇమేజ్ తీసుకొస్తాడో, చెర్రీకి కూడా ఈ రంగ స్థలం అగ్ని పరీక్షే అనుకోవాలేమో.

 చెర్రీ సాధారణంగా లవర్ బాయ్ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలలో చేసాడు అందులో హావభావాలతో పెద్దగా పనిలేదు, ఇప్పుడు ఈ రంగ స్థలం విషయానికి వస్తే పాతకాలపు స్టేజి షోలలో హావభావాలు బాగా పలికించి అభిమానులను మెప్పించాలి, మరి చెర్రీ కి ఈ రంగ స్థలం అగ్ని పరీక్షే. ఇంతకీ, ‘రంగస్థలం’ అన్న టైటిల్‌ సుకుమార్‌ ఎందుకు పెట్టినట్లు.? ఇందులో నాటకాల ప్రస్తావన నిజంగానే వుండబోతోందా లేదా అనే దానికి రిలీజ్ అయ్యేవరకు చూడాల్సిందేనా లేక ట్రైలర్లో చూపించేస్తారా..