ప్రళయ రుద్రుడిగా ‘వినయ విధేయ రామ’ రాంచరణ్ ఫస్ట్ లుక్!

November 6, 2018 at 2:54 pm

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు రాంచరణ్. ఈ సినిమాతో తన కెరీర్ లో రెండు వందల కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో రాంచరణ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. ‘రంగస్థలం’ సినిమా తర్వాత మాస్ దర్శకకులు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు అవుతున్న ఫస్ట్ లుక్ మాత్రం రాలేదు.

మరోవైపు సినిమా సంక్రాంతి బరిలో దించుతారని టాక్ వినిపిస్తుంది..ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మెగా ఫ్యాన్స్ ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న త‌రుణం వ‌చ్చేసింది. రామ్‌చ‌ర‌ణ్ కొత్త సినిమా టైటిల్ తో పాటు, లుక్ కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ‘వినయ విధేయ రామ’ అంటూ దీపావళి సందర్భంగా మెగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, చరణ్ సరసన కథానాయికగా కైరా అద్వాని కనిపించనుంది.

Ram-Charan-Vinaya-Vidheya-Rama-First-Look-1541489730-1748

ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇక బోయ‌పాటి సినిమాల్లో హీరోలు మాస్ లుక్‌తోనే క‌నిపిస్తుంటారు. త‌న స్టైల్‌కి త‌గ్గ‌ట్టుగా మాస్ లుక్‌నే దింపాడు. ఓ ఫైట్ సీన్‌లో.. చ‌ర‌ణ్ వీర‌త్వం చూపించే షాట్ చూస్తుంటే ఈ సినిమా భారీ యాక్షన్ తరహాలో రూపొందుతున్నట్లు కనిపిస్తుంది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు.

ప్రళయ రుద్రుడిగా ‘వినయ విధేయ రామ’ రాంచరణ్ ఫస్ట్ లుక్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share