ఆఫీస‌ర్ మునిగిన…వ‌ర్మ‌కు పిచ్చ లాభాలు

June 4, 2018 at 1:50 pm
Ramgopal Varma, Officer, Nagarjuna, buyers, collections

వర్మ ఖాతాలో మరో డిజాస్టర్ యాడ్ అయ్యింది. వ‌రుస ప్లాపుల్లో ఉన్న వ‌ర్మ నాగార్జున‌ను ఏదోలా ప‌ట్టేసి చాలా చీప్‌గా ఆఫీస‌ర్ సినిమాను చుట్టేశాడు. సినిమా ఎంత డిజాస్ట‌ర్ అంటే వ‌ర్ణించ‌డానికి మాట‌లు కూడా లేవు. సినిమాకు చాలా చోట్ల థియేట‌ర్ల రెంట్లు కూడా రావ‌డం లేదు. తొలి రోజునే కొన్ని చోట్ల షోలు ఆపేస్తే, రెండో రోజే కొన్ని చోట్ల సినిమాను లేపేశారు. సినిమా ఇంత చెత్త వ‌సూళ్లు రాబ‌డుతుంటే బ‌య్య‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు ల‌బోదిబో మంటున్నారు.

ఏపీ రైట్స్ కొన్న బ‌య్య‌ర్ అయితే త‌న‌కు ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్య‌మ‌ని కూడా చెప్పేశాడు. ఇలా వ‌ర్మ ఆఫీస‌ర్‌ను న‌మ్ముకున్న వాళ్లంతా నిండా మునిగితే ఈ సినిమాతో వ‌ర్మ మాత్రం ఫుల్లుగా లాభ‌ప‌డిన‌ట్టు ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆఫీస‌ర్‌కు వ‌ర్మ స‌హ నిర్మాత‌గా ఉన్నారు. ఆఫీస‌ర్‌కు టోట‌ల్‌గా ప్రి రిలీజ్ బిజినెస్ రూ.20 కోట్ల వ‌ర‌కు జ‌రిగింది.

నాగ్ బొమ్మ చూపించి సినిమా రిలీజ్‌కు ముందే డిజిట‌ల్‌, టీవీ రైట్స్‌, డ‌బ్బింగ్ రైట్స్‌ను రూ.12 కోట్ల‌కు తెలివిగా అమ్మేశారు. ఇక థియేట్రిక‌ల్ రైట్స్ రూ.8 కోట్ల వ‌ర‌కు రాబ‌ట్టాయి. ఆ డబ్బులు వాళ్లకు రిటర్న్ అవుతాయో లేదో తెలియదు కానీ.. వర్మ, ఈ సినిమాకు నిర్మాత మాత్రం చ‌క్కా సేఫ్ అయ్యారు.

చాలా చీఫ్‌గా సినిమాను వ‌ర్మ చుట్టేశాడు. నాగ్‌కు రూ. 5 కోట్లు ఇవ్వాల్సి ఉండ‌గా… వ‌ర్మ మూడు కోట్లు చేతిలో పెట్టి స‌రిపెట్టేశాడ‌ట‌. సినిమాపై అంచ‌నాలు లేక‌పోవ‌డంతో త‌క్కువ రేటుకే అమ్మినా కొన్న వాళ్లు నిండా మునిగిపోయారు. ఇటు వ‌ర్మ మాత్రం ఫుల్లుగా జేబులో లాభం వెన‌కేసుకుని… సినిమా టాక్ తెలుసుకుని ఎంచ‌క్కా ముంబైకి చెక్కేశాడ‌ట‌.

ఆఫీస‌ర్ మునిగిన…వ‌ర్మ‌కు పిచ్చ లాభాలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share