యుగాల నాటి కురుక్షేత్ర యుద్ధం ఈ ‘రథం’ ట్రైలర్

October 6, 2018 at 10:11 am

రాజగురు ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎ.వినోద్ సమర్పణలో రాజా దారపునేని నిర్మిస్తున్న చిత్రం రథం. ఈ చిత్ర టీజ‌ర్‌, ఒక పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో రథంపై భారీగా అంచ‌నాలు నెలకొన్నాయి. టాలీవుడ్ లో పెద్ద సినిమాలకు ఎలగైతే క్రేజ్ ఉంటుందో.. ఈ మధ్య చిన్న సినిమాలకు కూడా క్రేజ్ పెరిగిపోయింది. తక్కువ బడ్జెట్ తో తీసినా…కంటెంట్ బలంతో సూపర్ హిట్లు కొట్టి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి.

‘రథం’ సినిమా నుంచి రీసెంట్ గా ‘బిల్‌ గేట్స్‌’ అనే గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విడుదల చేశారు. రొమాంటిక్‌గా సాగే కథ ఇది. కథ, కథనాల్లో కొత్తదనం ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ మద్య సాగే రొమాంటిక్ సీన్లు యూత్ ని బాగా ఆకర్షిస్తున్నాయి. అలాగే హీరో ఫైట్స్ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. పద్దెనిమి రోజుల యుద్ద..లక్షల్లో శవాలు..కురుక్షేత్ర యుద్దం కూడా ధర్మం కోసమే అనే డైలాగ్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తుంది.

సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగుతున్నట్లు కనిపిస్తుంది. ఇద్దరు ప్రేమికుల మద్య సాగే ప్రేమకథకు ఊరి పెద్దలు అభ్యంతరాలు చెప్పడం..హీరో హీరోయిన్ కోసం యుద్దం చేయడం కనిపిస్తుంది. కొత్త వాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాజ్‌గురు ఫిలిమ్స్ బ్యానర్‌ను ఏర్పాటు చేశాం. కాగా, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తుండగా.. ఈసినిమాలో గీత ఆనంద్, చాందిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజగురు ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎ.వినోద్ సమర్పణలో రాజా దారపునేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

యుగాల నాటి కురుక్షేత్ర యుద్ధం ఈ ‘రథం’ ట్రైలర్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsShare
Share