ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఎలా..?

టాలీవుడ్‌లో కొన్నేళ్ల క్రితం నుంచి కొన్ని ప్ర‌శ్న‌లు సినీ అభిమానుల‌కు పెద్ద స‌స్పెన్స్‌గా మిగిలాయి. రాజ‌మౌళి, వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే హీరోలు త్రివిక్ర‌మ్‌తో ఎందుకు చేయ‌రు ? అలాగే త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే హీరోలు రాజ‌మౌళి, వినాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో ఎందుకు ? చేయ‌రు. త్రివిక్ర‌మ్ మ‌హేష్‌, బ‌న్నీ, ప‌వ‌న్‌ల‌తోనే రెండేసి సినిమాలు చేశాడు. ప్రస్తుతం ప‌వ‌న్‌తో మూడో సినిమా చేస్తున్నాడు. ఇక వినాయ‌క్‌, రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో చేసిన ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్‌త్‌తో ఎందుకు చేయ‌ట్లేద‌న్న ప్ర‌శ్న‌కూడా పెద్ద స‌స్పెన్స్‌గానే ఉండేది.

పైన చెప్పుకున్న దాంట్లో ఒక్క బ‌న్నీ మాత్ర‌మే వినాయ‌క్‌తో న‌టించాడు. ఇక పైన కొంద‌రు హీరోలు, కొంద‌రు డైరెక్ట‌ర్ల‌తో మాత్ర‌మే చేయ‌డం అనేది ఇప్ప‌టి వ‌ర‌కు కాక‌తాళీయంగా జ‌రిగినా దీనిపై టాలీవుడ్‌లో చాలా గాసిప్పులు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. అయితే వీట‌న్నింటికి తెర‌దించుతూ ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్‌తో సినిమాకు ఓకే చెప్పాడు. ప్ర‌స్తుతం ఈ క్రేజీ ప్రాజెక్టు టాలీవుడ్‌లో వ‌చ్చే సినిమాల్లో ఇదో పెద్ద క్రేజీ ప్రాజెక్టు కానుంది.

ఇక ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అన‌గానే ఓ మాస్ హీరో, ఓ క్లాస్ డైరెక్ట‌ర్‌. వీరి కాంబోలో వ‌చ్చే సినిమా ఏ జాన‌ర్‌లో ఉంటుంద‌న్న ఆస‌క్తి స‌హ‌జంగానే ఉంటుంది. త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్‌ను క్లాస్‌గా చూపిస్తాడా ? లేదా మాస్ హీరోగానే ప్ర‌జెంట్ చేస్తాడా ? అన్న డౌట్లు చాలానే ఉన్నాయి. ఇక త్రివిక్ర‌మ్ సినిమాల్లో ప్ర‌ధాన‌బ‌లం ఎమోష‌న‌ల్‌, ఫ్యామిలీ, సెంటిమెంట్‌. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు కూడా త్రివిక్ర‌మ్ ఇవే అంశాలు బేస్ చేసుకుని ఫాలో అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ ప‌క్కా మాస్ + కాస్త క్లాస్ కావ‌డంతో త‌న జాన‌ర్ ఏమైనా మారుస్తాడేమో అని కొంద‌రు భావించారు. అయితే త్రివిక్ర‌మ్ మాత్రం తాను ఎన్టీఆర్ రూట్లోకి వెళ్ల‌కుండా ఎన్టీఆర్‌నే త‌న రూట్లోకి లాగేసుకున్నాడు. ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ‌+ఫ్యామిలీ క‌థ‌లో ఎన్టీఆర్ ప్ర‌జెంట్ చేయ‌బోతున్నాడ‌ట‌. ఎన్టీఆర్ కూడా ఈ కథకు ఓకే చెయ్యడానికి కారణం లేకపోలేదు, ఎందుకంటే బృందావనం తర్వాత జూనియర్ ఆ స్థాయిలో పూర్తి ఫ్యామిలీ కమ్ లవ్ జానర్ చేయలేదు.

రీసెంట్ గా వచ్చిన టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ.. ఈ నాలుగు సినిమాల్లో ఫ్యామిలీ ఎమోష‌న్లు, సెంటిమెంట్ ఉన్నా… అవి త‌క్కువ‌గానే ఉంటాయి. అయితే ఇప్పుడు త్రివిక్ర‌మ్‌తో చేసే సినిమా పూర్తిగా వీటిని బేస్ చేసుకునే ఉండ‌నుంది. ఏదేమైనా మ‌నం త్రివిక్ర‌మ్ సినిమాలో స‌రికొత్త ఎన్టీఆర్‌ను చూడ‌బోతున్నాం అన్న‌మాట‌