రెడ్డి గారి కాంబినేషన్ రిపీట్..!

February 13, 2017 at 7:14 am
86

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో త‌న కేరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన వందో సినిమాతో సూప‌ర్‌హిట్ కొట్టాడు ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య 101వ సినిమా కోసం ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నా ఇప్ప‌ట‌కీ ఏ ప్రాజెక్టు ఫైన‌లైజ్ కాలేదు. బాల‌య్య 101వ సినిమా కోసం ఐదుగురు ద‌ర్శ‌కుల పేర్లు వినిపిస్తున్నాయి.

ముందుగా కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రైతు సినిమా అనుకున్నారు. త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో రైతు సినిమా అనుకున్నారు. అయితే ఇప్పుడు కొత్త‌గా గ‌తంలో బాల‌య్య న‌టించిన ఓ హిట్ సినిమా కాంబినేష‌న్ రిపీట్ అవుతుంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.

బాల‌య్య – వివి.వినాయ‌క్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమా అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌నం అయ్యింది. 2002లో వ‌చ్చిన ఈ సినిమా అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయినా మంచి చిత్రంగా మిగిలింది. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించారు. త‌ర్వాత అదే బెల్లంకొండ బాల‌య్య‌తో ల‌క్షీ న‌ర‌సింహ సినిమ కూడా నిర్మించారు.

ఇక ఇప్పుడు మ‌రోసారి చెన్న‌కేశ‌వ‌రెడ్డి కాంబినేష‌న్ రిపీట్ అవుతుంద‌న్న టాక్ వ‌స్తోంది. వినాయ‌క్ ఇటీవ‌ల చిరు ఖైదీ నెంబ‌ర్ 150తో హిట్ కొట్టి స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చాడు. బాల‌య్య కోసం ఓ ప‌వ‌ర్ ఫుల్ క‌థ‌ను వినాయ‌క్ రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

 

రెడ్డి గారి కాంబినేషన్ రిపీట్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share