రేణుదేశాయ్‌.. వెడ్డింగ్ ప్లాన్ ఇదే..

July 10, 2018 at 2:53 pm
renu

అనేక ఊహాగానాల‌కు తెర‌దించుతూ రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతోంది.. ప‌వ‌న్ నుంచి విడిపోయాక‌.. తాను ఎనిమిదేళ్ల పాటు ఎంత మాన‌సిక వ్య‌థ‌ను అనుభ‌వించాన‌నీ.. ఇక దాని నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నానంటూ ఆమె వెడ్డింగ్ ప్లాన్ కుసంబంధించి కీల‌క విష‌యాలు వెల్ల‌డించించింది. నిన్న ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలె చెప్పింది. తాను విడాకులు కోర‌లేద‌నీ.. ప‌వ‌న్ కోర‌డం వ‌ల్లే త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఇచ్చాన‌నీ.. ఇందుకు తాను ఎంతో బాధ‌ప‌డ్డాన‌ని రేణు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

తాను చేసుకోబోయే వ్య‌క్తి త‌న పిల్ల‌ల భ‌విష్య‌త్‌కు భ‌రోసా ఇస్తార‌ని.. ఈ విష‌యంలో త‌న‌కు ఎలాంటి అనుమానాలు లేవ‌ని కూడా రేణు చెప్పుకొచ్చింది. ఇదే క్ర‌మంలో త‌న వెడ్డింగ్ ప్లాన్‌ను వివ‌రించింది. తమ పెళ్లి డిసెంబర్ నెలలో కోయంబత్తూర్ లోని ‘ఇషా’ సెంటర్ కు సంబంధించిన ‘లింగ భైరవీ’ ఆలయంలో జ‌రుగుతుంద‌ని ఆమె వెల్ల‌డించింది. తమ పెళ్లి నిరాడంబరంగా జరుగుతుందని వివరించింది . పెళ్లి తరువాత కోయంబత్తూర్ లోని ఒక అనాథ ఆశ్రమంలో అన్నదానం చేస్తామ‌ని రేణు చెప్పింది.

ఇక్క‌డ రేణు ప‌వ‌న్‌గురించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చెప్పింది. గతంలో తాను పవన్ ను పెళ్లి చేసుకున్నప్పుడు ఘ‌నంగా మెహందీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుందామని కోరుకున్నా దానికి పవన్ అంగీకరించలేద‌ని ఆమె చెప్పడం గ‌మ‌నార్హం. తన చిన్నచిన్న కోరికలను ఈ పెళ్లితో తాను తీర్చుకోబోతున్నాన‌ని ఆనందం వ్య‌క్తం చేసింది. ఇక తన కొడుకు అకిరా నందన్‌కు సినిమాలు అంటే అస్స‌లు ఇష్టం లేద‌నీ.. భ‌విష్య‌త్‌లో ర‌చ‌యిత‌గా మారేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని రేణు చెప్పుకొచ్చింది.

రేణుదేశాయ్‌.. వెడ్డింగ్ ప్లాన్ ఇదే..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share