అవును పవన్ విడాకులు కావాలన్నారు : రేణు దేశాయ్

July 7, 2018 at 12:34 pm
Renudesai, Pawan kalyan, Diverce, Revealed

రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూవుంటారు. ఇద్దరు పిల్లల ఆలనా పాలన చూస్తూనే .. మరాఠి చిత్రపరిశ్రమలో దర్శక నిర్మాతగా తన ప్రత్యేకతను చాటుకోవడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. పవన్ నుంచి విడిపోయిన ఇంతకాలానికి మరో వ్యక్తితో ఇటీవలే ఆమె నిశ్చితార్థం జరిగింది. అయితే గత కొంత కాలంగా పవన్, రేణు దేశాయ్ లు ఎందుకు విడిపోయారు అన్న విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వీరిద్దరూ ‘బద్రి’ సినిమాతో నిజంగా ప్రేమలో పడి..తర్వాత పెళ్లి చేసుకున్నారు.

కొంత కాలం ఎంతో అన్యోనంగా ఉన్న ఈ జంట అకస్మాత్తుగా చట్టపరంగా విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసున్న తర్వాత రేణు దేశాయ్ ఇద్దరు పిల్లలో పూణె లో నివసిస్తున్నారు. అయితే పవన్ మరో మహిళను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో ఇంటర్య్వూలో దాటవేస్తూ వచ్చిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

తన పర్సనల్‌ యుట్యూబ్‌ చానల్‌లో రిలీజ్‌ చేసిన ఇంటర్య్వూలో ఇన్నేళ్లు ఒంటరిగా సాగిన తన ప్రయాణం, ఎదుర్కొన్న కష్ట నష్టాలతో పాటు పవన్‌తో విడాకులకు కారణమైన పరిణామాలపై స్పందించారు. అయితే తాము కొంత కాలం హ్యాపీగానే ఉన్నా..ఒకానోక సందర్భంలో పవన్ విడాకులు కావాలని చెప్పడంతో తాను కూడా అడ్డు చెప్పలేక పోయానని అన్నారు.

అయితే ఈ విషయాలు ఇప్పటి వరకు చెప్పకుండా ఉన్నానంటే..కారణం పవన్ పై గౌరవంతోనే..అంతే కాదు ఇన్నేళ్లు ఇంటి విషయాన్ని బయటపెట్టి గోల చేయకూడదన్న ఉద్దేశంతోనే స్పందించలేదన్న రేణూ… ఇప్పుడు మరో ఇంటికి కోడలిగా వెళుతున్న తరుణంలో ప్రజలకు, అభిమానులకు క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే స్పందిస్తున్నానన్నారు.

అవును పవన్ విడాకులు కావాలన్నారు : రేణు దేశాయ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share