అరవిందుడి దాడి నుంచి బయటపడ్డ వర్మ!

October 9, 2018 at 9:47 am

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌లో భ‌యం పుట్టిందా..? ఆ సినిమా విడుద‌ల తేదీని వాయిదా వేసింది అందుకేనా..? అంటే ఇండ‌స్ట్రీవ‌ర్గాలు మాత్రం ఔన‌నే అంటున్నాయి. వ‌ర్మ ఎంత మొండి ఘ‌ట‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌యాప‌జ‌యాల లెక్క‌లు వేసుకోకుండా ముందుకు వెళ్తారు. వ‌రుస ఫ్లాపులు వెంటాడుతున్నా.. వ‌ర్మ‌కు ఇదేం క‌ర్మ అంటూ సైటైర్లు పేలుతున్నా.. ఇండ‌స్ట్రీలో ఆయ‌న సినిమాకు ఉన్న క్రేజీనే వేరు. వ‌ర్మ సినిమా అన‌గానే ప్రేక్ష‌కుల్లో తెలియ‌ని ఆస‌క్తి దానిక‌దే రేకెత్తుతుంది. మ‌రోవైపు వివాదాలు వెంట లేకుంటే ఆయ‌న కంటికి నిద్రుండ‌దు. ఎందుకోగానీ ఈ మ‌ధ్య ఆయ‌న‌లో కొంత మార్పు క‌నిపిస్తుంది. ఆయ‌న కూడా లెక్క‌లు వేసుకుంటున్నాడ‌ని ఇండ‌స్ట్రీవ‌ర్గాలు అంటున్నాయి.

RGV-Geher-horror-film

ఇక సూటిగా విష‌యానికి వ‌ద్దాం.. తాజాగా రామ్‌గోపాల్‌వ‌ర్మ‌ కొత్త వాళ్లతో నిర్మించిన ‘భైరవ గీత’. ధనుంజయ-ఐరా అనే కొత్త హీరో హీరోయిన్లు నటించిన ఈ చిత్రాన్ని సిద్ధార్థ అనే యువ దర్శకుడు రూపొందించాడు. అయితే ఆయ‌న టేకింగ్‌లో వ‌ర్మ క‌నిపిస్తున్నాడు. ఈ సినిమా విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌కూ మంచి స్పంద‌నే వ‌చ్చింది. మొత్తానికి ట్రైల‌ర్‌లోని స‌న్నివేశాలు సినిమాపై మ‌రింత ఆస‌క్తిని రేపుతున్నాయి. అయితే మొద‌ట‌.. సినిమాను ‘అరవింద సమేత’కు పోటీగా అక్టోబరు 12న విడుద‌ల‌ చేయడానికి వ‌ర్మ నిర్ణ‌యం తీసుకున్నాడు. దీనికి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్ట‌ర్లు కూడా వేశారు. ఈ నేప‌థ్యంలో వ‌ర్మ మొండిధైర్యం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కానీ.. వ‌ర్మ తుస్సుమ‌నిపించాడు. ఆయ‌న ధైర్యం ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం అయ్యింది. ఈ సినిమా ముందు అనుకున్న ప్రకారం 12న విడుద‌ల కావ‌డం లేదు. అయితే విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా.. ఎలాంటి ప్ర‌మోష‌న్ వ‌ర్క్ వ‌ర్మ చేయ‌క‌పోవ‌డంతో.. అంద‌రిలో డౌట్ మొద‌లైంది. అనుకున్న‌ట్లే.. ఈ సినిమాను అక్టోబ‌ర్ 26న విడుద‌ల చేసేందుకు ఆయ‌న డిసైడ్ అయ్యార‌ట‌. అయితే.. కన్నడ-తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాను ఇంకో రెండు భాషల్లోనూ విడుద‌ల చేసేందుకు వ‌ర్మ స‌న్నాహాలు చేస్తున్నారు. తమిళం.. హిందీల్లో కూడా ఒకేసారి ఈ చిత్రం విడుద‌ల చేస్తే.. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు కూడా క‌నెక్ట్ అవుతుంద‌ని అంచ‌నాలు వేస్తున్నాడ‌ట‌. చూద్దాం మ‌రి ఏం జ‌రుగుతుందో..

అరవిందుడి దాడి నుంచి బయటపడ్డ వర్మ!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share