
బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా తెరకెక్కిస్తాడు ? ఏ కథ తీసుకుంటారు ? ఎవరు హీరోగా చేస్తారని వెయిట్ చేసిన వాళ్లను రాజమౌళి ఇప్పుడు కాంబినేషన్‌తో కొట్టేశాడు. టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో రాజమౌళి #RRR ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ తో అద్భుతమైన కానుక ఇచ్చాడు. ఈ సినిమా ఎనౌన్స్మెంట్ అయితే జరిగింది కాని షూటింగ్ గురించి అప్డేట్స్ రావడం లేదు.
ఈ సినిమా ఎనౌన్స్ అయ్యాక ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరూ తమ కొత్త సినిమాల షూటింగ్లో బిజీ అయ్యారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉంటే, రామ్‌చరణ్ బోయపాటి సినిమా షూటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది ? ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నదానిపై ఎవ్వరికి క్లారిటీ లేకుండా పోయింది.
ఇక ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. నవంబర్‌లో సెట్స్‌మీదకు తీసుకువెళ్లి 2020 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నేషనల్ లెవెల్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు దేశం అంతా క్రేజ్ ఉన్న యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు.