ఆర్ఆర్ఆర్‌కు లీకేజీ షాక్‌…

February 10, 2019 at 9:07 am

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీ స్టార‌ర్ సినిమా ఆర్ఆర్ ఆర్ సినిమా చిత్రీక‌ర‌ణ చ‌క‌చ‌కా జ‌రుగుతోంది. ఇందులో రాంచ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే క‌థా ఎలా ఉండ‌బోతోంది..? ఈ ఇద్ద‌రు హీరోల‌ను రాజ‌మౌళి ఎలా చూపించ‌బోతున్నారు..? ఇది చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న క‌థ‌నా.. లేక మ‌రేదైనా కొత్త‌గా ప్లాన్ చేస్తున్నారా..? అనే ప్ర‌శ్న‌ల చూట్టూ అభిమానులు చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు భారీ షాక్ త‌గిలింది. ఇదే స‌మ‌యంలో అభిమానులు ఆనంద‌ప‌డే విష‌యమొక‌టి బ‌య‌ట‌కొచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన పోలీస్ స్టేష‌న్ సెట్ ఫొటో ఒక‌టి లీక్ అయింది. హైద‌రాబాద్ శివారులో వేసిన ఈ సెట్ ఫొటో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. అలాగే జూనియ‌ర్ ఆర్టిస్టుల‌కు సంబంధించిన ఫొటో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. వారి గెట‌ప్‌లు చూస్తుంటే.. అది సుమారు 1920 ప్రాంతంలో జ‌నం క‌ట్టుబొట్టును త‌ల‌పించేలా ఉన్నాయి.

1549768360-189

నిజానికి.. ఈ సినిమా సెట్స్ మీద‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఏ చిన్న విష‌యం కూడా బ‌య‌ట‌కు రాకుండా ఉండేలా చిత్ర‌యూనిట్ అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. అయినా.. ఏదో విధంగా చిత్రీక‌ర‌ణ ఫొటోలు, సెట్స్ ఫొటోలు బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉన్నాయి. ఇక ఈ లీకైన ఫొటోల‌తో ఆర్ ఆర్ ఆర్ క‌థాంశంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్‌కు లీకేజీ షాక్‌…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share