దుమ్మురేపిన ‘ఆర్ .ఎక్స్.100’ కలెక్షన్లు!

July 13, 2018 at 5:08 pm
RX 100, First Day Collections, Tollywood

హీరో హీరోయిన్ ఇద్దరూ కొత్తవాళ్లు ఆపై దర్శక నిర్మాతలు కూడా కానీ సినిమా మాత్రం మొదటి రోజునే రికార్డ్ స్థాయి వసూళ్ల ని సాధించి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది ” RX 100” చిత్రం . నిన్న విడుదలైన ఈ చిత్రం పై పెద్దగా అంచనాలు లేవు కానీ యువత ని ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉండటంతో భారీగా వసూళ్లు వచ్చాయి , నిన్న ఒక్క రోజులోనే రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి కోటి నలభై లక్షల గ్రాస్ వసూళ్ళ ని సాధించడం ట్రేడ్ విశ్లేషకులను , ఆ చిత్ర బృందాన్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది .

యూత్ ఫుల్ కంటెంట్ తో సినిమా తెరకెక్కడం… ట్రైలర్లతోనే ప్రేక్షకుల్ని ఆకర్షించేయడంతో మంచి క్రేజ్ ఉన్న కథానాయకుల సినిమాల్లాగే తొలి రోజు వసూళ్లొచ్చాయి. ముఖ్యంగా హైదరబాద్ – విజయవాడ – విశాఖపట్నం – వరంగల్ లాంటి మెట్రో నగరాల్లో థియేటర్లు హౌస్ ఫుల్ తో కనిపించాయి. బాక్సాఫీసు దగ్గర అంతా యువతరమే కనిపించింది. ఖర్చులతో కలిపి 2.70 కోట్లకు అమ్ముడైన సినిమాకి తొలి రోజు 1.41 కోట్లు షేర్లుగా వచ్చాయి.

ఈ లెక్కన తొలి రోజే సగం గిట్టుబాటైనట్టు లెక్క. కీలకమైన వీకెండ్ ఈ రోజు నుంచే షురూ అవుతుంది కాబట్టి ఈ మూడు రోజులు మరింత భీకరంగా వసూళ్లొచ్చే అవకాశాలున్నాయి. ఈ వారం గడిస్తే ఈ సినిమా స్థాయేంటో అర్థమవుతుంది. మొత్తంగా `ఆర్.ఎక్స్.100` అటు మేకర్స్ కీ… ఇటు బయ్యర్లకీ మంచి ప్రాఫిటబుల్ వెంచర్ అయింది. హీరో కార్తికేయకి వరుసకి బాబాయ్ అయిన అశోక్ రెడ్డి నిర్మాణంలోనే `ఆర్.ఎక్స్.100` తెరకెక్కింది. చిత్రంతో అటు హీరోకి క్రేజూ – ఇటు ఆయన బాబాయ్ కి మంచి ప్రాఫిటూ పక్కా అయ్యింది. అలాగే ఈ చిత్రంతో అజయ్ భూపతి రూపంలో ఓ మంచి దర్శకుడు – పాయల్ రాజ్ పుత్ హాట్ భామ వెలుగులోకి వచ్చింది.

దుమ్మురేపిన ‘ఆర్ .ఎక్స్.100’ కలెక్షన్లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share