‘ఆర్ఎక్స్ 100’ 2 డేస్ క‌లెక్ష‌న్స్‌

July 14, 2018 at 10:19 am
RX 100, Two days Collections, Movie, Profits

కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ శిష్యుడు, నూతన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం’ఆర్ఎక్స్ 100′. ఈ నెల‌12న ప్రేక్షకులముందుకు వచ్చినా ఈ సినిమా టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తోనే ఆస‌క్తిని క్రియేట్ చేసింది. యూత్‌ను బాగా ఎట్రాక్ట్ చేస్తోన్న ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

ఈ సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్లు అన్ని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్నడం విశేషం. హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, వైజాగ్ లాంటి ఏరియాల్లో ఈ సినిమాకు టిక్కెట్లు దొర‌క‌డం లేదు. కేవ‌లం రెండు రోజుల‌కే ఆర్ఎక్స్ 100 లాభాల్లోకి వ‌చ్చేసింది. ఈ సినిమా మొదటి రోజు వసూళ్లుతోనే సినీ వర్గాల్లో సైతం ఆసక్తిని కలిగించి రెండోరోజు కూడా మంచి వసూళ్లను రాబట్టింది.

రెండు రాష్ట్రల్లో రెండు రోజులకు గాను రూ. 2.51 కోట్ల షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రావు రమేష్ ముఖ్య పాత్రలో నటించారు. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

‘ఆర్ఎక్స్ 100’ 2 డేస్ క‌లెక్ష‌న్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share