‘సాక్ష్యం’కి సెన్సార్ షాక్

July 21, 2018 at 3:57 pm
Saakshyam, Bellamkonda Srinivas, Pooja Hegde, Sriwass, Censor Board

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న సమయంలో స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ సరసన స్టార్ హీరోయిన్ సమంత నటించింది. ఆ సినిమాలో శ్రీనివాస్ కి మంచి పేరు వచ్చింది. ఈ మద్య బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో జయ జానకీ నాయక సినిమాతో మరోసారి తనాంటే నిరూపించుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు.

_98cfddae-42e8-11e8-873d-4d6fb1883171

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా అభిషేక్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన సాక్ష్యం విడుదలకు సరిగ్గా వారం రోజులు మాత్రమే ఉంది. దర్శకుడు శ్రీవాస్ విలన్ జగపతిబాబు ఒకటీ ఆరా ఇంటర్వ్యూలు తప్ప ప్రమోషన్ విషయంలో దూకుడు కనిపించడం లేదు. ఫాంటసీ నేపధ్యంలో రూపొందిన ఇలాంటి సినిమాలను జనం మనసులోకి రిజిస్టర్ అయ్యేలా తీసుకెళ్లడం చాలా అవసరం. కానీ ఇప్పుడు ఈ సినిమా కొన్ని చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తుంది. సెన్సార్ కు వెళ్లిన సాక్ష్యంలో కొన్ని జంతువులతో తీసిన సన్నివేశాలు ఉండటంతో వాటికి సంబందించిన అనుమతి పత్రాలు చూపమని అధికారులు అడగటంతో అప్పటికప్పుడు వాటిని ఇవ్వలేక కొంత సమయం అడిగినట్టు సమాచారం.

మంగళవారంలోపు సదరు ఎన్వోసిలను సాక్ష్యం టీమ్ సబ్మిట్ చేయాలి. ఏ మాత్రం ఆలస్యం జరిగినా వాయిదా తప్పదు. మంచి టైం చూసుకుని పోటీ లేకుండా బరిలో దిగుతున్న సాక్ష్యంకు ఇది ఊహించని ఝలక్. గతంలోలాగా సినిమాల్లో తోచిన రీతిలో జంతువులను వాడడానికి లేదు. వాటి పరిరక్షణ చట్టాలు చాలా కఠినంగా అమలవుతున్నాయి. అధిక శాతం దర్శక నిర్మాతలు ఈ మధ్య చిన్న కోడిపెట్టను చూపాలన్నా గ్రాఫిక్స్ ని ఆశ్రయిస్తున్నారు. ఈ చిక్కుల్లో నుంచి సెన్సార్ తీసుకుని బయటపడితేనే సాక్ష్యం రూట్ క్లియర్ అవుతుంది. టైం లేదు కాబట్టి దాని గురించి ఉరుకులుపరుగులు పెడుతోంది టీమ్. పోటీగా ప్రస్తుతానికి నీహారిక నాగ అశ్విన్ హ్యాపీ వెడ్డింగ్ మాత్రమే ఉంది. సుశాంత్ చిలసౌ అన్నారు కానీ ఇంకా ఖరారు చేయలేదు.

‘సాక్ష్యం’కి సెన్సార్ షాక్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share