‘ సామీ స్క్వేర్ ‘ ట్రైల‌ర్ రివ్యూ…. ప‌గిలిపోయాయ్ (వీడియో)

June 3, 2018 at 7:07 pm
Saamy² trailer, Vikram, Keerthy Suresh

చియాన్ విక్ర‌మ్ – హ‌రి కాంబినేష‌న్‌లో ఎప్పుడో 2003లో వ‌చ్చిన సామి (తెలుగులో బాల‌య్య హీరోగా వ‌చ్చిన ల‌క్ష్మీ న‌ర‌సింహా) సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా విక్ర‌మ్‌కు తిరుగులేని మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత హ‌రి టాప్ డైరెక్ట‌ర్ అయిపోయాడు. ఇక మ‌ళ్లీ 15 ఏళ్ల‌కు వీరి కాంబోలో సామి సినిమాకు సీక్వెల్‌గా సామి స్క్వేర్ సినిమా తెర‌కెక్కింది.

విక్రమ్,కీర్తి సురేష్ జంటగా తమిళ భాషలో తెరకెక్కుతున్న చిత్రం ‘సామీ స్క్వేర్’. ఆదివారం ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. రెండు నిమిషాల పాటు ఉన్న ట్రైల‌ర్‌లో విక్ర‌మ్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా అద‌ర‌గొట్టేశాడు. హ‌రి సినిమాలో టాటా సుమోలు గాల్లోకి ఎగ‌రాల్సిందే… గోడ‌లు బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే. ఈ సినిమాలోనూ అదే చూపించాడు.

ఇక హీరోకు విల‌న్‌కు మ‌ధ్య అదిరిపోయే ఫైటింగ్ ఉంద‌ని తేలిపోయింది. హీరోయిన్ కీర్తి సురేష్ లుక్స్‌తో ఆక‌ట్టుకుంది. యాక్ష‌న్‌కు పెద్ద‌పీఠ వేస్తూనే కామెడీ, ల‌వ్ ట‌చ్చింగ్ కూడా హ‌రి ఇచ్చాడ‌ని ట్రైల‌ర్ చూస్తూనే తేలిపోయింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్ అవ్వనుంది . ట్రైల‌ర్‌తో అంచ‌నాలు పెంచేసిన హ‌రి సామి స్క్వేర్‌ను సామిని మించిన హిట్ చేస్తాడేమో ? చూద్దాం.

‘ సామీ స్క్వేర్ ‘ ట్రైల‌ర్ రివ్యూ…. ప‌గిలిపోయాయ్ (వీడియో)
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share