తేజు నెక్స్ట్… తిరుమల మీదే భారం

July 10, 2018 at 3:52 pm
Sai dharam tej, Next movie, Kishore tirumala, Mytri movies Banner

మెగాస్టార్ మేనళ్లుడు..మెగా ఫ్యామిల నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్. పిల్లా నువ్వులేని జీవితం, సబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ లాంటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సాయిధరమ్ వరుసగా ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్నారు. కొత్తగా ఉంటుంది కదా అని లవ్ స్టోరీని ఓకే చేస్తే దర్శకుడు కరుణాకరన్ పాతగానే ఆలోచించడంతో రిజల్ట్ పూర్తిగా తేడా కొట్టేసింది. ఈ సినిమా ప్రమోషన్ లో ఎన్నో సంచలన విషయాలు చెప్పిన సాయిధరమ్ రిజల్ట్ మాత్రం అందుకోలేక పోయాడు.

సాధారణంగా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు ఫ్లాప్ అయిన హీరోలు కెరీర్ పూర్తయిపోతుందని అంటారు. కానీ గతంలో చేసిన కొన్ని సినిమాల విజయాలు మెగా కాంపౌండ్ అనే బ్రాండ్ ఇంకా అవకాశాలు వచ్చేలా చేస్తున్నాయి. కాకపోతే ఇవన్నీ ఇంతకు ముందు కమిట్ అయినవి కావడంతో సెట్స్ పైకి వెళ్ళబోతున్నాయి. సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ చేయబోతున్న మూవీ దర్శకుడు కిషోర్ తిరుమలది. మైత్రి మూవీ మేకర్స్ దీనికి నిర్మాత.

మహేష్ బాబు-రవితేజ లాంటి అగ్ర హీరోలతో ప్రాజెక్ట్స్ చేస్తున్న మైత్రి తేజుతో చేయటం నిజంగా మనోడి అదృష్టం అనే చెప్పాలి. దర్శకుడు కిషోర్ తిరుమల తీసిన రెండు సినిమాల్లో అతని డెబ్యూ మూవీ నేను శైలజ ఒకటే హిట్. రామ్ తో తీసిని ఉన్నది ఒకటే జిందగీ కమర్షియల్ గా హిట్ కాలేక పోయింది. మరి ఇప్పుడు తేజుకి ఎలాంటి సినిమా ఇస్తాడా అని మెగా ఫాన్స్ టెన్షన్ మొదలైంది.

ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ ఎంత బలంగా ఉన్నా ఇలాంటి పరాజయాల వల్లే సుమంత్ లాంటి హీరోలు చాలా ఎక్కువ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఓ వైపు మెగా హీరోలు వరుసగా వస్తున్నారు..ఈ సమయంలో సాయిధరమ్ వరుసగా అపజయాలు అందుకుంటున్నాడు..మరి ఆ మార్క్ కొట్టేయాలంటే ఒక మంచి హిట్ పడాల్సి ఉంది. దాంతో భారమంతా కిషోర్ తిరుమల పైనే వదిలాడట.

తేజు నెక్స్ట్… తిరుమల మీదే భారం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share