గోపీ లెక్క తేలింది…ఇక తేజుది!

July 5, 2018 at 7:04 pm
Sai Dharam tej, Tej I love U, Pantham, gopichand, movie Result

టాలీవుడ్ లో వారసత్వపు హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ హీరోగా ప్రస్థానం మొదలుపెట్టాడు..కానీ ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయ్యింది. కెరీర్ నిలబెట్టుకోవడానికి విలన్ అవతారమెత్తి.. ఆ పాత్రల్లో మంచి పేరు వచ్చాక తిరిగి హీరోగా మారి.. ఆ రకంగానూ సక్సెస్ అందుకున్నాడు గోపీచంద్. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ హీరో.. మాస్ లో మంచి ఫాలోయింగే సంపాదించుకున్నాడు. కానీ మాస్ పేరుతో మూస సినిమాలకే పరిమితం అయిపోవడం.. కొత్తగా ట్రై చేసిన సినిమాల్లో ఏదో లోపం ఉండటం.. ఇలా రకరకరాల కారణాలతో అతడి కెరీర్ గాడి తప్పింది. గత ఆరేడేళ్లలో ‘లౌక్యం’ మినహాయిస్తే అతడికి హిట్టే లేదు. ఆ తర్వాత వచ్చిన ‘సౌఖ్యం’..‘గౌతమ్ నంద’..‘ఆక్సిజన్’ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నారు.

తాజాగా హీరో గోపిచంద్ నటించిన 25వ సినిమా ‘పంతం’. దర్శకుడు కె.చక్రవర్తి దర్శకత్వంలో రూపోందిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది. చాలా సినిమాల్లో చూసినట్టుగా కాకుండా ఇందులో పొలిటీషియన్స్ కాజేసే డబ్బుకు సంబందించిన అంశం ఆసక్తికరంగా, ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. హీరో గోపిచంద్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకోగా పరిణితి చెందిన ఆయన నటన, యాక్షన్ సన్నివేశాల్లో ఫైట్స్ మంచి ప్లస్ పాయింట్ గా నిలిచాయి.

దర్శకుడు ఒక సామాజిక అంశానికి కమర్షియల్ అంశాలని ఆపాదించాలని చేసిన ప్రయత్నం కొంత వరకు ఫలించింది. హీరోయిన్ మెహ్రీన్ లుక్స్ పరంగా ఆకట్టుకోగా ప్రతినాయకుడిగా చేసిన సంపత్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకోగా కమెడియన్స్ బాగా ఆకట్టుకున్నారు. మొత్తానికి ‘పంతం’తో గోపిచంద్ గట్టెక్కినట్టే అంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్..‘పిల్లా నువ్వు లేని జీవితం’సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు.

ఆ తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ తో మంచి విజయాలు అందుకున్న సాయధరమ్ త్వాత వచ్చిన తిక్క,విన్నర్, జవాన్, ఇంటిలిజెంట్‌ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో మనోడికి ఇప్పుడు హిట్ ఎంతో అవసరం..ఈ నేపథ్యంలో తొలిప్రేమ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే కాస్త ఆసక్తిగానే ఉంది..ప్రమోషన్ కూడా బాగానే వర్క్ ఔట్ చేస్తున్నాడు. మరి రేపు రిలీజ్ అయ్యే ‘తేజ్ ఐ లవ్ యూ’ హిట్ కోడితేనే..సాయిధరమ్ భవిష్యత్ ఉంటుందని..లేదంటే కష్టాలు తప్పవని ఫిలిమ్ వర్గాలు అంటున్నారు.

గోపీ లెక్క తేలింది…ఇక తేజుది!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share