భగవద్గీత సాక్షిగా సాయి ధరమ్ తేజ్ మరో ఛాలెంజ్

July 12, 2018 at 9:59 pm
sai dharm tej, new movie, bhagavath geetha sakshiga, title

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్. మొదటి సినిమా రేయ్ అయినప్పటికి కొన్ని అవాంతరాల వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన సుబ్రమాణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ తో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మనోడికి బ్యాడ్ టైమ్ మొదలైంది.

తిక్క సినిమా నుంచి మొన్నటి తేజ్ ఐ లవ్ యూ వరకు వరుస ఫ్లాప్ లు అందుకుంటూ వస్తున్నాడు. దాంతో తేజ్ కెరీర్ పై అనుమానాలు మొదలయ్యాయి. కాకపోతే మెగా బ్యాగ్ గ్రౌండ్ నుంచి రావడంతో సాయిధరమ్ కెరీర్ ఇంకా కొనసాగుతుంది. అయితే రాబోయే సినిమాలు కూడా ఇలాగే ఫ్లాప్ అయితే మాత్రం మనోడు ఇండస్ట్రీలో మనుగడ కొనసాగించడం కష్టం అని అంటున్నారు.

మొన్ననే విడుదలైన `తేజ్` కొద్దిలో కొద్దిగా ఉపశమనాన్నిచ్చింది. పరాజయాల మాటేమో కానీ దర్శకులు మాత్రం సాయిని దృష్టిలో ఉంచుకొని కథలు సిద్ధం చేస్తూనే ఉన్నారు. గోపాల్ అనే ఓ కొత్త దర్శకుడు తేజ్ని దృష్టిలో ఉంచుకొని `భగవద్గీత సాక్షిగా` పేరుతో ఓ కథని సిద్ధం చేసి వినిపించాడట. కథ తేజ్ కి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు తెలిసింది.

ఇదొక క్రైమ్ థ్రిల్లర్ కథ అని సమాచారం. ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. భగవద్గీత సాక్షిగా అనే పేరే ఆసక్తిని రేకెత్తిస్తోంది. భగవద్గీతని మనం గీత అని కూడా అంటుంటాం. అన్నట్టు తేజ్ ప్రస్తుతం చిత్రలహరి చిత్రం కోసం రంగంలోకి దిగే ప్రయత్నాల్లో ఉన్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి తెరకెక్కబోతోంది. ఇందులో హలో భామ కళ్యాణి ప్రియదర్శన్ – అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటిస్తారని తెలుస్తోంది

భగవద్గీత సాక్షిగా సాయి ధరమ్ తేజ్ మరో ఛాలెంజ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share